బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చెయ్యనుంది. చాలామంది ప్రేక్షకులు ఆమెను తెలుగు సినిమాలో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ శ్రీదేవి కి కూతురు అవుతుంది. శ్రీదేవి తెలుగు సినిమాల్లో అంత బాగా రాణించిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆమె కూతురు మాత్రం టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా చేయలేదు. తెలుగులో సినిమా చేస్తే ఆమెకు మంచి హిట్స్ ఇవ్వాలని శ్రీదేవి ఫాన్స్ కోరుకుంటున్నారు. దేవర సినిమాతో ఆమెకు అతిపెద్ద భారీ హిట్ వస్తుందని చాలామంది ఆశిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ అందాల తార నటించిన బాలీవుడ్ మూవీ ఉలాజ్ ఆగస్టు 2న విడుదల. నిన్న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది, ప్రేక్షకుల నుంచి మోస్తరు స్పందనను అందుకుంది. ఈ చిత్రాన్ని రాజీ మేకర్స్ నిర్మించారు. ఉలాజ్ కూడా అంతే విజయం సాధిస్తుందని అందరూ ఆశించారు. అయితే అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కథ లండన్‌లో సీక్రెట్ ఏజెంట్‌గా మారిన మహిళా రాయబారి చుట్టూ తిరుగుతుంది.
పేలవమైన కథ , పూర్ ఎగ్జిక్యూషన్, బోరింగ్ సన్నివేశాలు సినిమాను నిరాశపరిచాయి. అదనంగా, జాన్వీ కపూర్ కోసం సినిమా చూసిన వారు కూడా నిరాశ చెందారు, ఆమె నటించిన పాత్రకు ఆమె వయస్సు, ఇమేజ్ సరిపోలేదని భావించారు. మొత్తంమీద, ప్రజల నుంచి నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. జాన్వీ తన కెరీర్‌లో మొదట్లో మహిళా ప్రధాన చిత్రాలతో ప్రయోగాలు చేస్తూనే ఉంది, కానీ అవి పెద్దగా విజయం సాధించలేదు. చూస్తుంటే ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ ఏమాత్రం కలిసి రాలేదు అనిపిస్తుంది. తాజా ఫ్లాప్ ఆమెకు మరొక షాక్ అని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్‌లతో పాటు ప్రాజెక్ట్‌లతో టాలీవుడ్‌లో తన కెరీర్‌ను విజయపథంలో నడిపించాలని ఆమె చూస్తోంది. ఈ తార ఇక్కడైనా సక్సెస్ కావాలని ఆశిద్దాం.