అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి.. వీడియో వైరల్..
ఈ నేపథ్యంలోనే నవీన్ పొలిశెట్టి ఈ రోజు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశాడు, ప్రస్తుతం తన జిందగీ ఎలా నడుస్తుందో ఈ వీడియో ద్వారా తెలియజేశాడు. ఆ వీడియోలో అతని రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ నటుడు బాధాకరంగా ఏమీ మాట్లాడలేదు. అది కూడా చాలా ఫన్నీగా తెలియజేసి అందరి చేత నవ్వించాడు. నవీన్ రికవరీ టైం లో ఉన్నాడు కాబట్టి బిజీ లైఫ్ నుంచి చాలా ఫ్రీ అయ్యాడు.
"కొత్త వీడియో. లైఫ్ ఒక జిందగీ అయిపోయింది 😜 త్వరలో కలుద్దాం జానే జిగర్స్” అని నవీన్ పొలిశెట్టి ఈ వీడియోను పంచుకున్నారు."లైఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి హ్యూమర్ అనేది మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే నవ్వుతూ ఉండండి. మీ అందరినీ నవ్వించడం నాకు చాలా ఇష్టం. నేను పూర్తిగా కోలుకున్న తర్వాత కొత్త చిత్రాలతో త్వరలో పెద్ద తెరపై కలుస్తా. ట్రూలీ యువర్స్ నవీన్ ఫొలిశెట్టి" అని వీడియో చివరిలో ఒక మెసేజ్ కూడా రాశాడు.
ఈ వీడియో ప్రారంభంలో నవీన్ సినిమాలో చూడడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ప్రతి మూవీలో కూడా హీరోలు తమ హ్యాండ్ పవర్ చూపిస్తూ ఉంటారు. నవీన్ మాత్రం తన హ్యాండ్ ఫ్రాక్చర్ అయిన విషయం గుర్తుతెచ్చుకొని బాధపడుతుంటాడు. క్రికెట్ మ్యాచ్ చూసినా కూడా ఏం పేరు రెండు హ్యాండ్స్ ఎత్తి చూపిస్తాడు. ఆ పని తాను చేయలేని అనుకుంటూ నవీన్ బాధపడి పోతాడు. తర్వాత ఒక డీజే పార్టీకి వెళ్లి డాన్స్ చేస్తూ ఉంటారు అందరూ హాండ్స్ అప్ చేసి డాన్స్ చేయాలంటూ కోరతారు. మీరేమైనా పోలీసుల హ్యాండ్సప్ అనడానికి అంటూ నవీన్ బాగా ఫైర్ అవుతాడు.
అతను చూపించే ఈ బాధంతా కూడా చాలా ఫన్నీగా చూపిస్తాడు అందుకే దాన్ని చూసినవారు నవ్వకుండా ఉండలేరు. విరిగిన చేతి పై అతను చేసిన ఫన్నీ కామెంట్స్ చాలామందిని నవ్వించాయి. ఇకపోతే ఈ హీరో సితార ఎంటర్టైన్మెంట్ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఖాళీ గానే ఉన్నాడు కాబట్టి కొత్త సినిమాల స్క్రిప్ట్స్ వింటున్నాడు.