డబుల్ ఇస్మార్ట్ : మాస్ ట్రైలర్ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!

frame డబుల్ ఇస్మార్ట్ : మాస్ ట్రైలర్ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!

murali krishna
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందిన హిట్‌ మూవీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. 2019లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ సరసన కావ్య థాపర్‌ నటిస్తుండగా.. సంజయ్‌ దత్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమా పైన మంచి హైప్ క్రీయేట్ చేసాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ పైన అప్డేట్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్‌లోని గురజాడ కళాక్షేత్రంలో జరగనుందని తెలిపారు. కాగా.. ఇందులో నుంచి విడుదలైనా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ట్రైలర్‌పై ప్రేక్షకుల్లో ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవల్‌లో చేరుకుంది. ఇక భారీ అంచనాల మధ్య ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న.. రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.మామా.. శంకర్ గాడి మెంటల్‌ మాస్‌ కీ రెడీ అయిపోండి.. అంటూ రిలీజ్ చేసిన ట్రైలర్ అప్‌డేట్ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు రెడీనా..? మామా మాస్క్ ఉంటే నీకు దొంగోడు మాత్రమే కనబడతడు.. మాస్క్‌ లేకుంటే నీకు మిండెడు కనపడ్తడు.. అంటూ డబ్బింగ్ స్టూడియోలో ఉన్న రామ్ డబుల్ ఇస్మార్ట్‌ స్టైల్‌లో చెబుతున్న డైలాగ్స్‌ మాస్‌ సినిమాలను ఇష్టపడే అభిమానులకు పక్కా వినోదాన్ని అందించబోతున్నట్టు చెప్పకనే చెబుతున్నాయి.డబుల్ ఇస్మార్ట్‌ మాస్‌ మ్యూజిక్‌ జాతరలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన స్టెప్పమార్ , మార్ ముంతా చోడ్‌ చింతా సాంగ్‌ సాంగ్స్‌కు నెట్టింట మంచి స్పందన వస్తోంది. మరోవైపు డబుల్‌ ఇస్మార్ట్‌ టీజర్‌ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఇస్మార్ట్‌ శంకర్‌కు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి సేమ మ్యాజిక్‌ను రిపీట్ చేసే ప్రయత్నం చేయబోతున్నట్టు ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్ చెబుతున్నాయి. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్‌ ఆదిత్య మ్యూజిక్‌ సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: