ప్రభాస్ కొత్త మూవీ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..?

frame ప్రభాస్ కొత్త మూవీ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..?

murali krishna
ప్రభాస్ ‘కల్కి 2898 AD’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.1100 కోట్ల బిజినెస్ చేసింది. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఖాతాలో చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. ప్రభాస్ నటించబోవు నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్ డేట్ ఒకటి ఫ్యాన్స్ ను పండగ చేసుకునేలా చేస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. ‘కల్కి’ సినిమా తర్వాత ప్రభాస్ కొంత గ్యాప్ తీసుకుని మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’తో తిరిగి రాబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదలైంది. దీని భారీగా రెస్పా్న్స్ వస్తోంది. దీని తరువాత ఆయన ఓ పీరియాడిక్ డ్రామాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి సంబంధించి అనేక అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రభాస్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ గత రెండు సినిమాలు అద్భుతంగా ఆడాయి. ‘కల్కి’ తర్వాత ఆయన ‘ది రాజా సాబ్’తో రానున్నారు. ఫౌజీ చిత్రం అపూర్వమైన చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో.. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగిన యుద్ద కథను చూపించబోతున్నారు. అంతేకాకుండా ఈ ఫౌజీ సినిమాలో ప్రేమకథ హృదయానికి హత్తుకునేలా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో ఆయన నటిస్తారని గతంలో చెప్పుకున్నారు. అయితే, ఇది సుభాష్ చంద్రబోస్ కాలాన్ని చూపుతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్ తన ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.ప్రస్తుతం ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ కాబోతోంది.ప్రభాస్ సరసన ఈ సినిమాలో ఎవరు నటిస్తారు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే... ఇందులో ఆయనది సైనికుడి పాత్ర అని, ఇండో - పాక్ బోర్డర్ నేపథ్యంలో సన్నివేశాలు ఉన్నాయని, అందుకని పాకిస్తానీ నటి సజల్ అలీని ఎంపిక చేసినట్టు ప్రచారం జరిగింది.లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... ఆమె బదులు మృణాల్ ఠాకూర్ ను ఫైనలైజ్ చేశారని టాక్. 'సీతా రామం'తో ఆమెను తెలుగు తెరకు హను రాఘవపూడి పరిచయం చేశారు. మరొకసారి ఆమెతో సినిమా చేయనున్నారని టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కూడా అయిపోయిందట. అందుకే వెంటనే పట్టాలెక్కిస్తున్నారు. ఆగస్ట్ 17న పూజా కార్యక్రమాలతో ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఆగస్ట్ 24 నుంచి రెగ్యులర్ షూట్ కు వెళతారట.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే అటు రాజాసాబ్ తో పాటు సైమల్టేనియస్ గా ఫౌజీ షూటింగ్ లోనూ పాల్గొంటాడు ప్రభాస్. అందుకే రాజా సాబ్ నెక్ట్స్ ఇయర్ వరకూ వెళ్లిందనే కమెంట్స్ కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: