సినీ లవర్స్ కి ఆగస్టు నెలలో కొత్త కష్టాలు.. ఎవరి దారి ఎటువైపో..?

frame సినీ లవర్స్ కి ఆగస్టు నెలలో కొత్త కష్టాలు.. ఎవరి దారి ఎటువైపో..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సమయాల్లో ఎవరైనా మంచి సినిమా వస్తే చూద్దాం అనుకున్నా థియేటర్లలో సినిమాలు ఉండవు. కానీ మరికొన్ని సందర్భాలలో ఏ సినిమాలు చూడాలో అర్థం కాని రేంజ్ లో సినిమాలు థియేటర్లలో ఉంటాయి. ఇక ఆగస్టు నెలలో అనేక సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే విచిత్రంగా చాలా సినిమాలు రీ రిలీస్ కూడా కానున్నాయి. దానితో సినీ లవర్స్ కొత్తగా విడుదల అయిన సినిమాలకు వెళ్లాలా లేక ఆల్రెడీ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకు వెళ్లాలా అనేది అర్థం కాక సతమతం అవుతున్నారు.

ఈ నెల రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబల్ ఈస్మార్ట్ , మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ , నాచురల్ స్టార్ నాని హీరోగా వివేకా ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం ఇలా ఈ మూడు సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల కానున్నాయి. ఇలా ఈ నెలలో మూడు మంచి క్రేజ్ ఉన్న సినిమాలు విడుదల కానుండగా అదే స్థాయిలో చాలా కాలం క్రితం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన అనేక సినిమాలు రీ రిలీజ్ కూడా కానున్నాయి. ఇప్పటికే ఆగస్టు 2 వ తేదీన నాని హీరోగా సమంత హీరోయిన్గా రూపొందిన ఎటో వెళ్లిపోయింది మనసు మూవీ రీ రిలీజ్ అయ్యింది.

ఇక ఆగస్టు 8 వ తేదీన మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు , అలాగే ఆ తర్వాత రోజు మహేష్ బాబు హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మురారి సినిమా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 వ తేదీన రీ రిలీజ్ కానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరియర్లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన ఇంద్ర సినిమా ఆగస్టు 22 వ తేదీన రీ రిలీజ్ కానుంది. ఇక ఆగస్టు 29 వ తేదీన నాగార్జున హీరోగా రూపొందిన శివ మూవీ రీ రిలీజ్ కానుంది. ఇలా ఆగస్టు నెలలో ఇటు కొత్త సినిమాలు , అటు బ్లాక్ బాస్టర్ మూవీలు అనేకం థియేటర్లలోకి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: