తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ స్టోరీని చెప్పిన తాప్సి..!

frame తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ స్టోరీని చెప్పిన తాప్సి..!

Pulgam Srinivas
మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా సొట్ట బుగ్గల సుందరి తాప్సి వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో తన నటనతో అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ తర్వాత తెలుగు లో ఈమెకి వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దట్టడం మొదలు అయింది. ఇకపోతే ఈమెకు అవకాశాలు భారీగానే వచ్చిన ఆ స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. ఈమె ప్రభాస్ హీరో గా రూపొందిన మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇలా మంచి జోష్ లో తెలుగులో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అక్కడ ఈమెకు మంచి అవకాశాలు దక్కాయి. అలాగే విజయాలు కూడా దక్కాయి. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే హిందీ సినీ పరిశ్రమలో మంచి స్థాయికి వెళ్ళింది. ప్రస్తుతం కూడా ఈమె వరసగా హిందీలో నటిస్తూ వస్తుంది.

ఇకపోతే కొంత కాలం క్రితం తాప్సి బ్యాట్మెంటన్ కోచ్ మథియాస్‌ ను పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా తాప్సి "ఫిర్‌ ఆయీ హసీనా దిల్‌రుబా" అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్ లలో తాప్సి పాల్గొంది. అందులో భాగంగా తాప్సి మాట్లాడుతూ ... మథియాస్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయన నాకు చాలా కాలంగా తెలుసు. కామన్ ఫ్రెండ్స్ వల్ల మేము పరిచయం అయ్యాము. ఆయన దాదాపు తొమ్మిదేళ్ల క్రితమే నాకు ప్రపోజ్ చేశాడు. వెంటనే నేను అంగీకరించ అని తాప్సి తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: