ఆనందం మూవీ హీరోయిన్ రేఖ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ తెలుగు హీరోనా..?
రేఖ అసలు పేరు అక్షర. ఈమె కన్నడలో చిత్ర అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత తెలుగులో ఆనందం మూవీ లో నటించింది.ఈ సినిమా భారీ హిట్ అవ్వడంతో రేఖకి వరుస ఆఫర్స్ తలుపు తట్టాయి. ఇక అలా ఆఫర్స్ వస్తున్న సమయంలోనే బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇక బాలీవుడ్ కి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈమెపై కన్నెర్రజేసి ఆ తర్వాత ఆఫర్స్ ఇవ్వలేదు. అయితే ఈ విషయం పక్కన పెడితే గతంలో రేఖ నటుడు రోహిత్ తో ప్రేమలో ఉందనే వార్త టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో జోరుగా వినిపించింది. ఇక వీరి కాంబినేషన్లో అనగనగా ఓ కుర్రాడు అనే మూవీ వచ్చింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందనే టాక్ వినిపించింది.
ఆ తర్వాత రేఖ మీద ప్రేమతోనే రోహిత్ తాను హీరోగా చేసిన జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలో స్నేహితురాలి పాత్ర ఇచ్చారనే టాక్ వినిపించింది.అయితే ఇది కేవలం రూమరేనని, అవకాశాల కోసమే రేఖ అలా రోహిత్ తో క్లోజ్ గా ఉందని తెలుస్తోంది. కానీ రేఖ గాఢంగా ప్రేమించిన హీరో కన్నడ నటుడు గణేష్..రేఖ గణేష్ కాంబినేషన్లో కన్నడలో కొన్ని సినిమాలు వచ్చాయి. అలా సినిమాలో నటిస్తున్న సమయంలోనే వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడి గాఢంగా ప్రేమించుకున్నారట. కానీ గణేష్ మాత్రం ఓవైపు రేఖని ప్రేమిస్తూనే మరోవైపు వేరే అమ్మాయిని ప్రేమించి రాత్రికి రాత్రే సీక్రెట్ గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారట. దీంతో మోసపోయాను అని తెలుసుకున్న రేఖకి ప్రేమ, పెళ్లి పై నమ్మకం పోయి సింగిల్ గా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక గతంలో ఆలీతో జాలీగా అనే షోలో పాల్గొన్న రేఖ సినిమాల్లో అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని, హీరోయిన్ గానే కాదు అక్క,అత్తా, పిన్ని, ఫ్రెండు ఇలా ఏ క్యారెక్టర్ అయినా సరే చేస్తాను. నాకు సినిమాలపై అంత పిచ్చి ఉంది అంటూ చెప్పింది.