మృణాల్ ఠాకూర్ : ఆ పాత్ర కోసం ఏకంగా నిర్మాతలతోనే గొడవపడ్డా..!!

frame మృణాల్ ఠాకూర్ : ఆ పాత్ర కోసం ఏకంగా నిర్మాతలతోనే గొడవపడ్డా..!!

murali krishna
ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క సినిమాతో చెరగని ముద్ర వేసుకుంది. నేటి తరం సీత ఎవరంటే మృణాల్ పేరు చెప్పేంత పేరు సంపాదించుకుంది. సీతా రామం సినిమాతో బెంగాలీ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ గా మారిపోయింది. సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ చిన్నది.స్టార్‌గా ముద్ర వేసుకున్నాక బోలెడన్ని అవకాశాలు వస్తాయి. అందులోంచి నచ్చిన పాత్రను ఎంచుకోవచ్చు. ఏదైనా పాత్ర మిస్ అయినా పెద్దగా ఫీలయ్యేది ఉండదు. కానీ కెరీర్ ఆరంభంలో ఏదైనా పాత్ర కోసం ముందు ఎంచుకుని, తర్వాత పక్కన పెడితే చాలా బాధ పడతారు ఆర్టిస్టులు. ఐతే మేకర్స్ ఇలా వేర ఆప్షన్ తీసుకున్నపుడు ఏం చేస్తాంలే అని బాధ పడి ఊరుకుంటారు ఎవరైనా. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం అలా ఎలా చేస్తారంటూ గొడవ పడి మరీ ఒక పాత్రను లాక్కుందంట.
‘పూజా మేరీ జాన్’ అనే సినిమా విషయంలో ఇలా జరిగినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది మృణాల్. ఇది మృణాల్ కెరీర్లో లాంగ్ డిలేయ్డ్ మూవీ. ఈ సినిమా పనులు చాలా ఏళ్ల కిందట మొదలయ్యాయి. రెండేళ్ల కిందటే దీని చిత్రీకరణ పూర్తయింది. విడుదల మాత్రం ఆలస్యం అవుతోంది.ఈ ఏడాది చివర్లో ‘పూజా మేరీ జాన్’ రిలీజ్ కావచ్చని చెప్పిన మృణాల్.. ఇందులో ప్రధాన పాత్ర కోసం తాను నిర్మాతలతో గొడవ పడ్డ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. “పూజా మేరీ జాన్ కోసం ముందు నన్నే సంప్రదించారు. చాలాసార్లు ఆడిషన్ జరిగింది. నా కెరీర్లో అన్నిసార్లు ఆడిషన్ చేసిన సినిమా ఇంకోటి లేదు. ఆ పాత్రతో నేను ఎమోషనల్‌గా బాగా కనెక్టయ్యాను. ఐతే ముందు నాకు ఆఫర్ చేసిన పాత్రకు మరొకరిని ఎంచుకున్నారని తర్వాత తెలిసింది. నేను నిర్మాతలతో ఈ విషయమై గొడవ పడ్డాను. ఈ పాత్ర నాకే కావాలని అడుక్కున్నాను. చివరికి ఆ క్యారెక్టర్ నేనే చేశాను. ఆ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. ఈ ఏడాదే రిలీజవుతుందని అనుకుంటున్నా” అని మృణాల్ తెలిపింది.కాగా రీసెంట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో, అలాగే కల్కి లో క్యామియో రోల్ లో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: