ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎక్కువ లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగా మరీ ముఖ్యంగా హీరోయిన్స్ పోలీస్ పాత్రలో నటించడానికి మరింత ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ మూవీలలో పోలీస్ పాత్రలో నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి. ఆ మూడు సినిమాలు ఏవి ఎలాంటి రిజల్ట్ ను తెచ్చుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించిన కాజల్ అగర్వాల్ కొంత కాలం క్రితం సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా జూన్ నెలలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలలో నటించిన పాయల్ రాజ్ పుత్ తాజాగా రక్షణ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.
పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ ను అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ నటిమని చాందిని చౌదరి తాజాగా యేవమ్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా జూన్ జూలై నెలలో విడుదల అయిన ఈ మూడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.