బుల్లితెరపై స్టార్ హీరోల మూవీలకి దీటుగా రెస్పాన్స్ తెచ్చుకున్న అంజలి లేటెస్ట్ మూవీ..!

frame బుల్లితెరపై స్టార్ హీరోల మూవీలకి దీటుగా రెస్పాన్స్ తెచ్చుకున్న అంజలి లేటెస్ట్ మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మణులతో అంజలి ఒకరు. ఈమె తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ సినీ పరిశ్రమ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. జర్నీ అనే తమిళ్ డబ్బింగ్ సినిమా ద్వారా ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుండి ఈమెకు తెలుగులో అవకాశాలు భారీగా పెరిగాయి. కొంత కాలం పాటు ఈమె అద్భుతమైన రీతిలో తెలుగులో కెరియర్ ను కొనసాగించింది. అలాంటి సమయంలోనే ఈ బ్యూటీ గీతాంజలి అనే హర్రర్ కామెడీ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న గీతాంజలి మూవీ కి కొనసాగింపుగా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాను తాజాగా రూపొందించారు. ఈ సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఆ తర్వాత ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అక్కడ పరవాలేదు అనే స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా చానల్లో ప్రసారం అయింది.

ఇక ఈ మూవీ బుల్లి తెరపై మాత్రం సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 7.39 టి ఆర్ పి రేటింగ్ ను తెచ్చుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించిన ఈ సినిమాకు బుల్లి తెరపై ఈ స్థాయి టి ఆర్ పి రేటింగ్ అంటే గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో ప్రేక్షకులను అలరించని స్టార్ హీరోల మూవీ లకు కూడా ఈ స్థాయి టి ఆర్ పి రేటింగ్ దక్కడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: