రజనీకాంత్‌తో ఈక్వల్‌గా నిలుస్తున్న ప్రభాస్.. ఏ విషయంలోనంటే..??

Suma Kallamadi
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత అందనంత ఎత్తుకు చేరుకున్నాడు. ఇప్పుడు కూడా అదే ప్లేస్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సలార్, కల్కి సినిమాలతో బాక్సాఫీస్ ని మళ్ళీ షేర్ చేశాడు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా ప్రభాస్ కి పోటీ ఇవ్వలేకపోతున్నది వాస్తవం. ఇండియన్ బాక్సాఫీస్‌కు ప్రభాస్ అసలైన మొగుడయ్యాడు. ప్రభాస్ సినిమాలకు ఎవరూ కూడా పోటీగా రావడం లేదు. ప్రభాస్ ప్రతి సినిమా కూడా కనీసం రెండు వారాలు పాటు మిగతా ఏ సినిమా కూడా కలెక్షన్లు కలెక్ట్ చేయకుండా బాక్సాఫీస్‌ని తన గ్రిప్ లో పెట్టుకుంటుంది. అయితే ప్రభాస్ ప్రోటీన్ సినిమా చేయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు మొత్తం డిఫరెంట్ కథలనే ఎంచుకుంటున్నాడు. ఉదాహరణకురీసెంట్ రిలీజ్ కల్కి 2898AD. ఇది విభిన్నమైన కథతో వచ్చి వరల్డ్ వైడ్ గా 1100 కోట్లకి పైగా డబ్బులు వసూలు చేసింది.

నెక్స్ట్ ఈ హీరో నుంచి "ది రాజాసాబ్" సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ లో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ కనిపించాడు కథ కూడా బాగుంటుందని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా ఏదో ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ప్రభాస్ అందిస్తాడని నమ్ముతున్నారు. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఒక రొమాంటిక్ హర్రర్ కామెడీ. టాప్ హీరోగా ఉండి హర్రర్ కామెడీ జానర్ సినిమాలు చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఇద్దరు తప్ప. వారిలో ప్రభాస్ ఒకరు మరొకరు సూపర్ స్టార్ రజినీకాంత్. రజనీకాంత్ కెరీర్ పిక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే చంద్రముఖి హారర్ కామెడీ చేసి ఆశ్చర్యపరిచాడు. 2005లో వచ్చిన ఆ సినిమా రజనీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

 ప్రభాస్ తీస్తున్న "ది రాజాసాబ్" సినిమా కూడా ఇలాగే మంచి హిట్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఈ మూవీ అలాంటి స్టోరీ తో వస్తుందో తెలుసుకోవాలని బాగా ఆసక్తి చూపిస్తున్నారు. హారర్ కామెడీ చేయడం కొద్దిగా రిస్క్ తో కూడుకున్న పని. ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు ఆసక్తిగా సాగితేనే అది హిట్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: