ఫుల్లుగా తాగి డైరెక్టర్ రాఘవేంద్రరావుని కొట్టడానికి వెళ్లిన స్టార్ హీరో.. ఎవరంటే..?

Divya

టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావుతో ఎంతోమంది హీరోలు సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లను చూపించే విధానం కూడా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎంతో మంది హీరోలకు కూడా బిగ్ బ్రేకులు ఇచ్చిన ఘనత రాఘవేంద్రరావు అందుకున్నారు. అప్పట్లో దాదాపుగా అందరి హీరోలతో సినిమాలను తెరకెక్కించారు.అలాంటి వారిలో హీరో రాజశేఖర్ కూడా ఒకరు.

డైరెక్టర్ రాఘవేంద్రరావు ఆయన కెరీయర్ని మార్చేశారు యాంగ్రీ యంగ్ మాన్ గా ఇమేజ్ సంపాదించుకున్న రాజశేఖర్ అల్లరి ప్రియుడు సినిమాతో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసి మంచి విజయాన్ని అందుకునేలా చేశారు. రాజశేఖర్ కి బిగ్ హిట్ ఇవ్వడంతో పాటు భారి ఇమేజ్ని అందుకునేలా చేశారు. ఈ సినిమాని రాజశేఖర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. అలాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి రాజశేఖర్ కి గొడవపడడంతో అప్పట్లో పెద్ద ఎత్తున దూమారం రేగిందట.

ముఖ్యంగా తాగేసి హీరో రాజశేఖర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు మీదికి వెళ్లారట. అలా వెళ్లడమే కాకుండా తిట్టడమే కాకుండా కొట్టారని ప్రచారం కూడా గతంలో ఎక్కువగా వినిపించేది.. ఈ విషయం పైన రాఘవేంద్రరావు సీరియస్ కావడం చేత అక్కడ కొంతమంది మనుషులు రాజశేఖర్ ని బలవంతంగా తీసుకొని పోయారట. అయితే వీరు గొడవకు గల కారణాలు ఏంటి అనే విషయం మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు.

జీవిత రాజశేఖర్ మొదట్లో చెన్నైలో ఉండేవారు. ఆ తర్వాత సినిమాల కోసం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు ఆ సమయంలోనే డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా హైదరాబాద్ కి వచ్చారట. జీవితా కూడా అడపాదడపా సినిమాలకు షూటింగ్ కి వచ్చేదట. అలా ఒకసారి డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమా షూటింగ్ సెట్లో పరిచయం కావడం చేత తనని సినిమాలలోకి కంటే సీరియల్స్ నటిస్తే బాగుంటుందని చెప్పారట. అలా చెప్పినప్పటికీ ఆమెను సినిమాల్లోకి తీసుకురావాలని డైరెక్టర్ రాఘవేంద్రరావు ప్లాన్ చేయడంతో ఈ విషయం రాజశేఖర్ కు తెలియడంతో తన మరదలని రాఘవేంద్రరావు చీట్ చేయబోతున్నారని ఎవరో   రాజశేఖర్కు లేనిపోనివి చెప్పడంతో.. ఆ సమయంలో తాగేసి కోపంతో డైరెక్టర్ మీదికి వెళ్ళాడని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం అయితే వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: