తెలుగు హీరోలలో చాలా మంది ఇప్పటికే థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా చాలా కాలం క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ నగరంలో ఏ ఎం బి పేరుతో ఏషియన్ సంస్థతో కలిసి ఓ థియేటర్ ను నిర్మించాడు . ఇక పోతే ప్రస్తుతం ఈ థియేటర్ అద్భుతమైన స్థాయిలో నడుస్తుంది . దానితో మహేష్ బాబు హైదరాబాదు లో మరో థియేటర్ ను కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది . ఇక మాస్ మహారాజా రవితేజ కూడా ఒక థియేటర్ ను ఇప్పటికే ఏషియన్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఏషియన్ సంస్థతో కలిసి ఇప్పటికే ఏ ఏ ఏ (ఏషియన్ అల్లు అర్జున్) పేరుతో హైదరాబాదు లో ఓ థియేటర్ ను నిర్మించాడు. ప్రస్తుతం ఈ థియేటర్ అద్భుతమైన స్థాయిలో నడుస్తుంది. ఇలా ఇప్పటికే ఏషియన్ సంస్థతో కలిసి అల్లు అర్జున్ నిర్మించిన థియేటర్ అద్భుతంగా నడుస్తూ ఉండడంతో ఈ సంస్థతో కలిసి అల్లు అర్జున్ మరో థియేటర్ ను కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
అసలు విషయం లోకి వెళితే ... విశాఖపట్నంలో ఏ ఏ ఏ పేరుతో మల్టీ ప్లెక్స్ ను నిర్మించడానికి పూజా కార్యక్రమాన్ని కూడా మరికొన్ని రోజుల్లోనే నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే హైదరాబాదు లో నిర్మించిన థియేటర్ అద్భుతమైన స్థాయిలో నడుస్తూ ఉండడంతో ఆసియన్ సంస్థతో కలిసి విశాఖపట్నం లో కూడా ఓ భారీ మల్టీ ప్లెక్స్ థియేటర్ ను నిర్మించడానికి అల్లు అర్జున్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇలా టాలీవుడ్ హీరోలు ఎక్కువ మంది ఏషియన్ సంస్థతో కలిసి థియేటర్ లను నిర్మించడంలో అత్యంత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.