షాక్: క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఐశ్వర్య..!

Divya
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ అనే పదం వినిపిస్తూనే ఉంటుంది.. ఈ పదం ఏదో ఒక సందర్భంలో కూడా చాలామంది సెలబ్రిటీలు తెలియజేస్తూ ఉంటారు. మరి కొంతమంది తమ కెరియర్ లో ఎదురైనా ఇలాంటి సంఘటనల పైన ఇటీవల కాలంలో చాలా మంది ఓపెన్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్య సుస్మిత తన కెరియర్లో ఎదురైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలియజేసింది. ఇటీవల ఈమె నటించిన బాడ్ కాప్ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది.

ముఖ్యంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా ఎక్కువగానే ఉందని తెలిపింది ఐశ్వర్య సుస్మిత.. అయితే ఈ విషయం అందరికీ తెలియజేయాలనది ఒక్కటే మార్గం కాదని తెలిపింది.. తాను ఎప్పుడు ఎలాంటి ఆడిషన్స్ ని మిస్ చేసుకోలేదని తెలియజేసింది. తాను విలువల విషయంలో ఎక్కడ రాజీ పడనని కష్టపడి పనిచేస్తానంటూ తెలియజేసింది ఐశ్వర్య సుస్మిత.. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఇలాంటివి చాలానే విన్నాననీ తెలిపింది.

చాలామంది వ్యక్తులు తన దగ్గర ఇలాంటి కథలు చాలానే చెప్పేవారు.. తాను అప్పటికి మోడల్ గా ఉంటున్న సమయంలో ఈ విషయాలను తెలిపే వాళ్ళని తెలిపింది. మీరు వారితో పడుకోకపోతే మీకు అవకాశాలు రావని కూడా చాలామంది బెదిరించారని కానీ పరిశ్రమలోకి రావడానికి ఇది ఒక్కటే సరైన మార్గం కాదు.. కానీ ఆ సమయంలో కొంతమంది డైరెక్టర్లు క్యాస్టింగ్ డైరెక్టర్స్ తనని పర్సనల్గా కలవమని కూడా చెప్పారని.. అయితే ఇక్కడ ఎవరూ కూడా మనమల్ని బలవంతం చేయడం లేదు.. వెళ్లాలా వద్దా అనే విషయం కేవలం మన మీదే ఆధారపడి ఉంటుంది అంటు తెలిపింది. ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా కార్పొరేటర్ రంగంలో కూడా ఎక్కువగా ఉందని తన అనుభవాలను సైతం తెలియజేసింది ఐశ్వర్య సుస్మిత.

2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ గా కూడా పేరు సంపాదించింది. మోడలింగ్ నుంచి నటన వైపుగా అడుగులు వేసింది. ప్రస్తుతం ఓటీటీ లో పలు వెబ్ సిరీస్లలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: