మిరపకాయ్ మూవీకి ఆ టైటిల్ అనుకున్నాను.. కానీ రవితేజ అలా అనేసాడు... హరీష్ శంకర్..?

Pulgam Srinivas
దాదాపు చాలా కాలం నుండి సినిమాలు మొదలు అయిన తర్వాత షూటింగ్ మధ్యలో ఆ కథకు ఏ టైటిల్ బాగుంటే ఆ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనేక పేర్లు తెలపైకి వస్తూ ఉంటాయి. అందులో ఏ టైటిల్ ను ఫిక్స్ చేయాలి అనుకున్న సమయంలో ఆ టైటిల్ హీరోకు , దర్శకుడు కి , నిర్మాతకు పూర్తి సాటిస్ఫై అయినప్పుడే దానిని దాదాపుగా కన్ఫామ్ చేస్తూ ఉంటారు. లేదంటే మరో టైటిల్ కి వెతుకుతూ ఉంటారు.


ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిరపకాయ్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే మొదట మిరపకాయ్ సినిమాకు ఈ టైటిల్ ని కాకుండా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ వేరే టైటిల్ అనుకున్నాడట. దానిని హీరో అయినటువంటి రవితేజకు వినిపించగా దానికంటే వేరే టైటిల్ బాగుంటుంది అని మరో టైటిల్ ను సూచించాడట. మరి హరీష్ శంకర్ అనుకున్న టైటిల్ ఏమిటి , దానిని రవితేజ ఎందుకు మార్చాడు అనే వివరాలను తెలుసుకుందాం.


రవితేజ హీరోగా హీరోగా శంకర్ మిరపకాయ్ అనే సినిమా చేస్తున్న సమయంలో ఆ మూవీ కి టైటిల్ ఫిక్స్ చేయని నేపథ్యంలో హరీష్ శంకర్ ఈ మూవీ కి రొమాంటిక్ రిషి అనే అనే టైటిల్ ను ఫిక్స్ చేద్దాం సార్ అని రవితేజ తో అన్నాడట. దానితో ఆయన ఆ టైటిల్ కంటే మరపకాయ్ అనే టైటిల్ బాగుంటుంది ఆలోచించండి అని అన్నాడట. దానితో హరీష్ శంకర్ కి కూడా రొమాంటిక్ రిషి అనే టైటిల్ కంటే మిరపకాయ్ అనే టైటిల్ నచ్చడంతో దానినే ఆ మూవీ కి టైటిల్ గా ఫిక్స్ చేశారట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో భాగంగా హరీష్ శంకర్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: