సూర్య 'కంగువా' లో ఆ స్టార్ హీరో.. ఇక ఫ్యాన్స్ కు పండగే..!!

murali krishna
కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా సిరుత్తై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ పై ప్రస్తుతం గ్రాండ్ లెవెల్లో నిర్మితమవుతున్న లేటెస్ట్ మూవీ కంగువ. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా నటరాజన్ సుబ్రహ్మణ్యం, జగపతిబాబు, యోగి బాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.ఐతే స్టార్ హీరోలైన ఇద్దరు అన్నదమ్ములు ఒక సినిమాలో కలిసి నటిస్తే అభిమానులకు వచ్చే కిక్కే వేరు. ఐతే తమిళ సూపర్ స్టార్ సూర్య, స్టార్ హీరోగా ఎదిగిన అతడి తమ్ముడు కార్తి ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ కలిసి నటించలేదు. సూర్య ద్విపాత్రాభినయం చేసిన ‘బ్రదర్స్’ సినిమాలో ఒక పాత్రకు కార్తి డబ్బింగ్ చెప్పాడు కానీ.. అన్నయ్యతో స్క్రీన్ మాత్రం షేర్ చేసుకోలేదు. ఐతే ఎట్టకేలకు వీళ్లిద్దరినీ ఒకే సినిమాలో చూసే అవకాశం రాబోతోంది.ఐతే
ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.కంగువా సినిమాలో సూర్య సోదరుడు కార్తి యాక్ట్‌ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.
ఈ చిత్రానికి తమిళంలో లిరిసిస్ట్‌గా పని చేస్తున్న వివేక్.. ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘కంగువ’లో కార్తి నటిస్తుండడం నిజమా అని అడిగితే.. ప్రొడక్షన్ హౌస్ అనుమతి లేకుండా ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ కార్తి క్యామియో రోల్‌లో కనిపిస్తాడు అని బదులిచ్చాడు వివేక్. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘కంగువ’ చిత్రం ఒక మల్టీవర్స్‌లా ఉంటుందని.. వేరే సినిమాల్లోని ఐకానిక్ క్యారెక్టర్స్ ఇందులో కనిపిస్తాయని అంటున్నారు.

 ‘కంగువ’ సినిమా శైలి చూస్తే.. ఇందులో ‘కార్తి’ కాష్మోరా సినిమాలోని రాజ్ నాయక్ పాత్రలో ఏమైనా కనిపిస్తాడా అనే సందేహాలు కలుగుతున్నాయి.అలానే సూర్య తో పాటు కార్తీ పాత్ర పార్ట్ 2 లో మరింతగా సాగుతుందని, మొత్తంగా కంగువ లో హీరో కార్తీ విజువల్ బ్లాస్ట్ ఆడియన్స్ కి మంచి ఐ ఫీస్ట్ అని అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. కాగా కంగువ పార్ట్ 1 మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన కంగువ రిలీజ్ అనంతరం ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.స్టార్ హీరోలైన ఇద్దరు అన్నదమ్ములు ఒక సినిమాలో కలిసి నటిస్తే అభిమానులకు వచ్చే కిక్కే వేరు. ఐతే తమిళ సూపర్ స్టార్ సూర్య, స్టార్ హీరోగా ఎదిగిన అతడి తమ్ముడు కార్తి ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ కలిసి నటించలేదు. సూర్య ద్విపాత్రాభినయం చేసిన ‘బ్రదర్స్’ సినిమాలో ఒక పాత్రకు కార్తి డబ్బింగ్ చెప్పాడు కానీ.. అన్నయ్యతో స్క్రీన్ మాత్రం షేర్ చేసుకోలేదు. ఐతే ఎట్టకేలకు వీళ్లిద్దరినీ ఒకే సినిమాలో చూసే అవకాశం రాబోతోంది.ఐతే కార్తి ఎలా కనిపించినా.. అన్నదమ్ములిద్దరినీ ఒకే సినిమాలో చూడ్డం మాత్రం అభిమానులకు మాంచి కిక్ ఇస్తుందనడంలో సందేహం లేదు.దాంతో సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇలాంటి వాటి గురించి చెబితే.. సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గుతుందని, ఇలాంటి ట్విస్ట్ లను డైరెక్ట్ గా తెరపై చూస్తేనే కిక్కొస్తుందని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: