ప్రభాస్ స్పిరిట్ మూవీలో ఊహించని ట్విస్ట్.. అస్సలు ఊహించలేదుగా..?

murali krishna
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించనున్న స్పిరిట్ మూవీపై క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంది. అసలు ఈ చిత్రం ఎలా ఉంటుందా అనే విషయం చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఈ తరుణంలో ఈ చిత్రంపై ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో సందీప్ రెడ్డి బిజీగా ఉన్నారు. మరోవైపు ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారని.. ప్రభాస్ రెండు పాత్రల్లో ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ సినిమా ఇంటర్వెల్ లోనే ప్రభాస్ రెండో పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే, ఈ వార్తల విషయంలో ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అన్నట్టు ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో అదే ఈ సినిమాలో ఉంటుందట. ఇప్పటికే, 80 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమా తెరకెక్కనుంది.ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. 2024 చివర్లో ‘స్పిరిట్’ చిత్రీకరణ ప్రారంభం కానుందని, ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ కాప్ గా కనిపిస్తారని వంగా వెల్లడించడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల మీద కూడా ట్రేడ్ పండితులు అప్పుడే టార్గెట్ కూడా ఫిక్స్ చేశారు.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశం గట్టిగానే ఉందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే గనక జరిగితే సందీప్ రెడ్డి వంగాకి తొలి వెయ్యి కోట్ల గ్రాసర్  "స్పిరిట్" మూవీనే అవుతుంది.
ఇంతకు ముందు ‘బాహుబలి 2’ (2017) సినిమాతో ప్రభాస్ వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశారు. ఇక ప్రభాస్ నుండి వచ్చిన మరో భారీ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’ చిత్రం కూడా 1100 కోట్ల మైలురాయిని దాటేగా,‘స్పిరిట్’ కూడా అంచనాలను అందుకోగలిగితే రెబల్ స్టార్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. వంగా అంటేనే అగ్రెసివ్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరు. అలాంటి పాత్రలోనే తమ అభిమాన హీరోని చూడాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి స్పిరిట్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: