అల్లరి మూవీకి అన్ని గంటల్లో ఆ పని చేశా.. దెబ్బకి సురేష్ బాబు షాక్.. నరేష్..!

frame అల్లరి మూవీకి అన్ని గంటల్లో ఆ పని చేశా.. దెబ్బకి సురేష్ బాబు షాక్.. నరేష్..!

MADDIBOINA AJAY KUMAR
ఇ వి వి సత్యనారాయణ కుమారుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ , రవి బాబు దర్శకత్వంలో రూపొందిన అల్లరి అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తోనే మంచి విజయాన్ని , సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇకపోతే అల్లరి నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా అల్లరి సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ... అల్లరి సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.


కాకపోతే డబ్బింగ్ పూర్తి కాలేదు. ఒక రోజు రవిబాబు వచ్చి డబ్బింగ్ కంప్లీట్ చేసావా అని అడిగాడు. ఇంకా పది రోజులు ఉంది కదా సార్ చేస్తాను అని చెప్పాను. దానితో ఆయన కచ్చితంగా త్వరగా పూర్తి చెయ్యి అని చెప్పి వెళ్ళాడు. ఇక ఆ తర్వాత నేను దాదాపు నైట్ 12 గంటలకు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాను. ఇక అలా కంటిన్యూగా 6 గంటలు చెపుతూ వచ్చాను. ఉదయం 5 గంటలు అయ్యే వరకు డబ్బింగ్ కంప్లీట్ అయింది. సురేష్ బాబు కు ఉదయాన్నే జాగింగ్ చేయడం అలవాటు. అలా ఆయన ఆరోజు జాగింగ్ చేస్తూ నేను డబ్బింగ్ చెప్పిన దగ్గరికి వచ్చాడు.


ఇక్కడ ఏం చేస్తున్నావ్ అన్నాడు. డబ్బింగ్ చెప్పాను సార్ అన్నాడు. డబ్బింగ్ చెప్పావా..? ఎన్ని గంటల్లో చెప్పావు అని అన్నాడు. దానితో ఆరు గంటల్లో మొత్తం చెప్పేసాను సార్ అన్నాడు. దానితో ఆయన లోపలికి వెళ్లి ర్యాన్ డం గా అనేక సన్నివేశాలు నేను డబ్బింగ్ ఎలా చెప్పానో అని చెక్ చేశాడు. అంతా సూపర్ గా ఉంది. ఓకే డబ్బింగ్ సూపర్ గా వచ్చింది. వెళ్లి రెస్ట్ తీసుకో అన్నాడు. ఆలా ఆయన ఆ రోజు డబ్బింగ్ ఓకే చేయకపోయి ఉంటే నాకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పేవారు అని అల్లరి నరేష్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: