బిగ్ బాస్ 8 : ఏంటి.. ఈసారి హోస్ట్ నాగార్జున కాదా?

frame బిగ్ బాస్ 8 : ఏంటి.. ఈసారి హోస్ట్ నాగార్జున కాదా?

praveen
తెలుగు బుల్లితెరపై బిగ్గేస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతూ ఉంది బిగ్ బాస్ కార్యక్రమం. ఎన్ని షోస్ ఉన్నప్పటికీ బిగ్ బాస్ షో కి మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ షో ప్రారంభమైంది అంటే చాలు మిగతా షో రేటింగ్స్ మొత్తం తగ్గిపోతాయి. అంటే ఇక మిగతా షోస్ చూసే ప్రేక్షకులు అందరూ కూడా బిగ్బాస్ చూడ్డానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఏకంగా ఏడు సీజన్స్ ప్రేక్షకులందరికీ కూడా అలరించాయి. ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్ తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతోంది.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం కొత్త సీజన్ కు సంబంధించిన కంటెస్టెంట్  ఎవరు, టాస్కులు ఎలా ఉండబోతున్నాయి ఇక హోస్ట్ చేయబోయేది నాగార్జునేనా లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ  కొంతమంది పేర్లు కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే తర్వాత వారంలోనే బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ లాంచింగ్ ఎపిసోడ్ ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అవ్వగా.. ఇక ఇప్పుడు విన్నర్ ఎవరో కూడా ముందే డిసైడ్ అయిపోయింది అనే వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది.


 పక్కగా విన్నర్ ఆమెనే అంటూ అందరూ తేల్చి చెబుతున్నారు. ఆమె ఎవరో కాదు స్ట్రీట్ ఫుడ్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించిన కుమారి ఆంటీ. ఈ పేరు సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే ఆమె సినిమా ప్రమోషన్స్ వంటివి కూడా చేశారు. ఇటీవలే బాలీవుడ్ నటుడు సోను సైతం కుమారి ఆంటీ ఫుడ్ కోర్టుని సందర్శించారు. దీంతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. టీవీ షోలు సినిమాలు సీరియల్స్ అంటూ ఇక సందడి చేస్తూనే ఉంది ఆమె. ఇక ఈమె వెనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారట. ఇక ఇదే నిజమైతే మాత్రం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఈమెనే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు లేడి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ టైటిల్ విన్ కాకపోవడంతో ఈసారి లేడీ కంటెస్టెంట్ కి ఇక టైటిల్ వచ్చేలా నిర్వాహకులు కూడా ప్లాన్ చేశారు.



ఇదిలా ఉంటే బిగ్బాస్ హోస్ట్ ఈసారి మారే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలం  నుంచి నాగార్జున హోస్టింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు. కానీ ఈసారి నాగార్జున ఈ కార్యక్రమం చేసేందుకు అంతగా సుముఖంగా లేరని దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త హోస్ట్ ని వెతుక్కుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే నానికి మరోసారి హోస్టింగ్ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తుండగా.. ఈసారి లేడీ హోస్ట్ రాబోతున్నారు అంటూ మరి కొంతమంది అనుకుంటున్నారు. మరి ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: