సరిపోద శనివారంకు పాత సినిమాల తలనొప్పులు !

Seetha Sailaja
వచ్చేనెల 29న విడుదలకాబోతున్న నాని ‘సరిపోదా శనివారం’ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టైటిల్ చాల డిఫరెంట్ గా ఉండటంతో ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని నాని అభిమానులు ఆశిస్తున్నారు. దీనికితగ్గట్టుగానే ఈమూవీకి పోటీగా మరే పెద్ద సినిమా విడుదల కాని నేపధ్యంలో ఈమూవీ కలక్షన్స్ కూడ చాల బాగుంటాయని ఈమూవీ బయ్యర్లు భావిస్తున్నారు.

అయితే ఎవరు ఊహించని విధంగా ఈమూవీకి పాత సినిమాల తలనొప్పులు ఎదురవ్వడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరువాత పవన్ కళ్యాణ్ క్రేజ్ విపరీతంగా తెలుగు రాష్ట్రాలలో పెరిగిపోయింది. దీనితో పవన్ నుండి ఎప్పుడు అతడు నటించే సినిమాలు వస్తాయా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పవన్ నటిస్తున్న ‘ఓజీ’ తో పాటు ఇతర సినిమాలు ఇప్పట్లో విడుదల అయ్యే ఆస్కారం కనపడటం లేదు. దీనితో సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 29న ‘గబ్బర్ సింగ్’ మూవీని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. ఆరోజు ఈమూవీ విడుదల సందర్భంగా ధియేటర్ల వద్ద భారీ స్థాయిలో హంగామాను పవన్ అభిమానులు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈసినిమాకు మళ్ళీ రికార్డు స్థాయిలో రెండు మూడు రోజులపాటు కలక్షన్స్ రాబోతున్నాయి అన్న సంకేతాలు వస్తున్నాయి.

ఈసినిమాతో పాటుగా నాగార్జున నటించిన ఒకనాటి ‘మాస్’ సినిమాను ఆరోజునే విడుదల చేస్తారని అంటున్నారు. దీనితో నాని సినిమాకు పాత సినిమాలతో కొత్త తలనొప్పులు వచ్చే ఆస్కారం ఉంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమధ్యకాలంలో రీ రిలీజ్ చేసిన పాత సినిమాలకు రికార్డు స్థాయిలో కలక్షన్స్ రావడం ఒక ట్రెండ్ గా మారింది. దీనితో ఈ ట్రెండ్ ను నాని ‘సరిపోదా శనివారం’ ఎంతవరకు ఎదుర్కుంటుందో చూడాలి. అయితే రీ రిలీజ్ సినిమాలను టాప్ హీరోల అభిమానులు మాత్రమే బాగా చూస్తున్న నేపధ్యంలో నాని సినిమాకు పెద్దగా దెబ్బ ఉండకపోవచ్చు..  





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: