బంగారం కోసం సమంత అంత రిస్క్ చేస్తుందా..?
ఆల్రెడీ బాలీవుడ్ లో సిటాడెల్ సీరీస్ ను పూర్తి చేసిన సమంత తనే నిర్మాతగా మారి మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. ఈ సినిమా కోసం సమంత తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టేస్తుందని తెలుస్తుంది. సమంత బంగారం సినిమా కోసం దాదాపు తన రెమ్యునరేషన్ కాకుండా 20 కోట్ల పైన ఖర్చు పెడుతుందని టాక్. యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ అంశాలు కూడా ఆశ్చర్యపరుస్తాయని అంటున్నారు.
సమంత బంగారం సినిమాను అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఐతే బడ్జెట్ తో పాటు ప్రమోషన్స్ కూడా అన్ని కలిపి 20 కోట్లలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారట. ఐతే సమంత నిర్మిస్తున్న ఈ సినిమా కు డైరెక్టర్ ఎవరన్నది ఇంకా రివీల్ కాలేదు. సమంత లీడ్ రోల్ చేస్తూ అటు నిర్మాతగా కూడా బాధ్యత మీద వేసుకుంది. తప్పకుండా సమంతకు ఈ సినిమా ఆమె కోరుకునే రేంజ్ లో సక్సెస్ సాధించాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. సమంత తిరిగి తెలుగు కమర్షియల్ సినిమాల్లో కూడా నటిస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. అది ఏ సినిమాతో సాధ్యపడుతుందో చూడాలి.