సూర్య హీరో కాకముందు ఆ పని చేసేవాడా..?

murali krishna
కోలీవుడ్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో నటించి నేషనల్ వైడ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సూర్య కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న సూర్య ఈ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. అయితే సూర్య హీరో కావడం వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు ఉన్నాయి. జులై నెల 23వ తేదీ సూర్య పుట్టినరోజు జరుపుకున్నారు. కాగా సూర్యకు సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సూర్య అసలు పేరు శరవణన్ కాగా డైరెక్టర్ మణిరత్నం  శరవణన్ పేరును సూర్యగా మార్చారు. తండ్రి శివకుమార్ ( హీరో అయినా సూర్య మాత్రం సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. సూర్య డిగ్రీ పూర్తి చేసే సమయానికి సూర్య తండ్రి హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు ఒక గార్మెంట్ కంపెనీలో పని చేసిన సూర్య రెండు నెలలకు 1200 రూపాయల వేతనం అందుకున్నారు. అప్పులు తీర్చాలనే ఆలోచనతో సూర్య సినిమాల్లోకి వచ్చారు.తాజాగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి శివకుమార్, హీరో కార్తీ, సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. తాను నటుడిగా ఎలా మారారో చెప్పారు.

జీవితానికి సంంబధించి విద్యార్థులు కలలు కనాలని.. వాటిని నెరవేర్చుకోవడానికి అన్ని విధాలుగా శ్రమించాలన్నారు.సూర్య మాట్లాడుతూ..”మన మనసు స్టీరింగ్ లాంటిది. గోల్ వైపు అది మళ్లే విధంగా చేయాల్సిన బాధ్యత మనదే. స్కూల్ లేదా కాలేజీలో ఉన్నప్పుడు నేను ఏమీ సాధించలేదు.. చదువు పూర్తైన తర్వాత గార్మెంట్ పరిశ్రమలో పనిచేశాను. రూ.1200 జీతం. కానీ ఆ ఉద్యోగం నచ్చలేదు. దాదాపు మూడు నెలల తర్వాత ఉద్యోగం వదిలేశాను. ఆ సమయంలో జీవితంలో యూటర్న్ తీసుకున్నాను.. అప్పుడే నటుడిగా మారాలని అనుకున్నాను..నేరుక్కు నేర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను..ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నాను ” అని అన్నారు.సూర్య కెరీర్ తొలినాళ్లలో నటించడానికి ఎంతో ఇబ్బంది పడటంతో “వీళ్ల నాన్న ఎంత గొప్ప నటుడో.. ఇతనంత వేస్ట్ పెలో” అని విమర్శలు వ్యక్తమయ్యాయి. నటుడు రఘువరన్ ఎంతకాలం మీ నాన్న పేరు చెబుతూ ఇండస్ట్రీలో బ్రతుకుతావ్ అని చేసిన కామెంట్లతో సూర్య నటనపై ఫోకస్ పెట్టారు. ఆస్కార్ అవార్డ్స్ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి దక్షిణ భారతీయ నటుడు సూర్య కావడం గమనార్హం.అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య పేద పిల్లలను చదివిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.జైభీమ్ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేలు జర్నలిస్టుగా పరిచయమై స్నేహితుడయ్యాడని.. నిరుపేద విద్యార్థులకు సాయం చేస్తుంటాడని… అతడితో కలిసి అగరం ఫౌండేషన్ స్థాపించినట్లు చెప్పుకొచ్చారు. అగరం అంటే ‘అ’ కారం.. అంటే తొలి అక్షరం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: