విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన కొత్త సినిమాను ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గతంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ ఎఫ్-2, ఎఫ్-3 చిత్రాల్లో నటించారు.ఇక ఈ సినిమాను జూలై 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభించి,చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నారట. ఈ స్టార్ హీరో పాత్ర నిడివి 30 నిమిషాల పాటు ఉండనుందట.ఒకప్పుడు సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చినా... ఈ మధ్య కాలంలో మాత్రం చాలా స్లో అయిపోయారు విక్టరీ వెంకటేష్. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గత సంక్రాంతికి 'సైంధవ్' అనే సినిమాతో వచ్చారు. కానీ, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సీనియర్ స్టార్ హీరో సోలో సక్సెస్ కోసం అనిల్ రావిపూడితో ప్రాజెక్టును లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే.ఒకవైపు వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి.. మరోవైపు సక్సెస్ కోసం చూస్తున్న విక్టరీ వెంకటేష్ కలిసి ఓ సినిమాను చేయబోతున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాకు 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్‌ను సైతం ఫైనల్ చేసుకున్నారు.ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ చేస్తున్న సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో రానా కూడా కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు రానా నాయుడు అనే ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది.మరి దాన్ని బేస్ చేసుకొనే ఈ సినిమాలో కూడా ఒక పాత్రను రానా చేత చేయించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.మరి అది నెగిటివ్ క్యారెక్టర్ లేదంటే పాజిటివ్ క్యారెక్టరా అనేది ఇంకా తెలియదు.కానీ వెంకటేశ్ సినిమాలో రానా ఒక కీలకపాత్ర పోషిస్తున్నారంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.ఇప్పటికే సీనియర్ హీరోలందరు మంచి విజయాలను అందుకుంటుంటే ఆయన మాత్రం వెనకబడిపోతుడనే చెప్పాలి.మరి ఎలాగైనా సరే ఆయన ఆ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టి తన మార్కెట్ ను కూడా అంతకు అంతకు పెంచుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది.