రష్మిక ఏకంగా ఆ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మూవీని మిస్ చేసుకుందా.. అదిగాని చేసుంటే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకుంది. ఇకపోతే ఈమె తన కెరీర్ లో కొన్ని సినిమాలను వదులుకోవలసి కూడా వచ్చింది. ఇకపోతే ఈమె కొన్ని సినిమాలను కథ నచ్చక వదిలేస్తే , మరికొన్ని సినిమాలను ఆ సమయంలో ఆ సినిమాకు తేదీలను అడ్జస్ట్ చేయలేక వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈమె వదులుకున్న సినిమాలలో కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకోగా మరికొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి.

అలా రష్మిక వదులుకున్న ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏది ... ఆ మూవీ ని ఎందుకు ఈ బ్యూటీ రిజెక్ట్ చేసింది అనే వివరాలను తెలుసుకుందాం. హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా మూవీ లు అద్భుతమైన విజయాలు కూడా అందుకున్నాయి. ఈయనకు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ఉంది.

ఇకపోతే  కొంత కాలం క్రితం ఈ దర్శకుడు ఆలియా భట్ ప్రధాన పాత్రలో గంగుబాయి కథియవాడి అనే సినిమాను తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో మొదట ఆలియా భట్ పాత్రకి రష్మిక మందన ను సంజయ్ లీలా భన్సాలీ అనుకున్నాడట. అందులో భాగంగా ఈమెను సంప్రదించి కథను కూడా వివరించాడట. కథ సూపర్ గా నచ్చిన అదే సమయంలో వేరే సినిమాలకు ఈ బ్యూటీ కమిటీ ఉండడంతో ఈ మూవీ చేయలేను అని చెప్పిందట. దానితో ఆ ఆఫర్ కాస్త ఆలియా కి వెళ్లినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: