సరిపోదా శనివారం కు చిత్రమైన కష్టాలు.. ఆ మూవీల రీ రిలీజ్ లతో నలిగిపోనుందా..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో కామన్ గా ఓ మూవీ రిలీజ్ అయ్యే తేదీనే మరో సినిమా కనుక విడుదల అయిన దానికి రెండు , మూడు రోజులు అటు , ఇటు ఏ సినిమా విడుదల అయిన ఆ మూవీ ద్వారా మరో మూవీ కి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ నాని కి మాత్రం ఒక విచిత్రమైన సంఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ కి అత్యంత దగ్గర లో మంచి క్రేజ్ ఉన్న ఏ సినిమా కూడా విడుదలకు లేదు. కానీ ఓ విచిత్రమైన సంఘటన ఈ మూవీ కి ఎదురు కాబోతోంది. అదేమిటి అంటే ... ఆగస్టు 29 వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా  అంతకు ఒక వారం ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ ని ఆగస్టు 22 వ తేదీన రీ రిలీస్ చేయనున్నారు.

ఇక ఆ తర్వాత సరిపోదా శనివారం విడుదల తేదీ అయినటువంటి ఆగస్టు 29 వ తేదీన నాగార్జున కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి శివ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 2 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న గబ్బర్ సింగ్ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నారు. ఇలా సరిపోదా శనివారం మూవీ కి రీ రిలీజ్ ల బెడద పట్టుకుంది. రి రిలీజ్ అయ్యే సినిమాలు కనుక ఏమైనా భారీ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తే దాని ఎఫెక్ట్ సరిపోదా శనివారం సినిమాపై పడే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: