మహేష్, రాజమౌళి మూవీ కోసం అదిరిపోయే టైటిల్..!!

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సినిమా కోసం చాలాయేళ్లుగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్ గా ఆ మూమెంట్ వచ్చేసింది. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు ఈ కాంబినేషన్ సెట్ అయ్యే టైమ్ కు రాజమౌళికి ప్యాన్ వాల్డ్ ఇమేజ్ వచ్చింది. ఇప్పటి వరకూ ప్యాన్ ఇండియా లీగ్ లో కూడా లేని మహేష్ కు ఇది డబుల్ బొనాంజాలాంటిది అని చెప్పాలి. హాలీవుడ్ కటౌట్ లాంటి మహేష్ కు రాజమౌళి లాంటి డైరెక్టర్ తోడైతే ఇంకా మనోడి రేంజ్ ను ఆపడం ఎవరి తరం అవుతుంది.అయితే ఈ కాంబినేషన్ లో సినిమా అయితే అనౌన్స్ అయింది కానీ.. షూటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఏం లేవు. ఈ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింటింగ్ గా ఉన్నారు.ఈ సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా హాట్ కేకులా మారుతోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోకు సంబంధించిన సినిమా టైటిల్ రివీల్ కాబోతోంది. దీనికి సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. టైటిల్ కూడా ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
రాజమౌళి, మహేష్ కాంబోకు సంబంధించి ఒక ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేయడం జరిగిందని తెలుస్తోంది. మహేష్ తప్ప మిగిలిన నటీ నటులు ఎవరై ఉంటారన్న ఊసే లేదు. పోనీ నటి నటుల సంగతి పక్కన పెట్టేస్తే.. కనీసం మూవీ టైటిల్ ను కూడా రివీల్ చేయలేదు. అసలు మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? ఎలా ఉండబోతుంది అనే హింట్స్ కూడా ఏమి లేవు. ఈ క్రమంలో మూవీ టైటిల్ పైన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఎప్పటికి ఎన్నో రకాల వార్తలు వినిపించిన తెలిసిందే.అంతేకాకుండా ఎన్నో రకాల పేర్లు కూడా వినిపించాయి.కానీ ఆ వార్తలన్నీ కూడా అవాస్తవాలు గానే మిగిలిపోయాయి.ఇకపోతే వచ్చే నెల అనగా ఆగ‌స్టు 9 మ‌హేష్ పుట్టిన రోజు.ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వస్తుందేమో అని మ‌హేష్ అభిమానులు భావిస్తున్నారు.కానీ ఈ విష‌యంపై మాత్రం స్ప‌ష్ట‌త లేదు.
రాజ‌మౌళి మ‌హేష్ బ‌ర్త్ డే కోసం ప్ర‌త్యేక‌మైన ప్లాన్స్ చేస్తున్న‌ట్టు ఏం క‌నిపించ‌డం లేదు.కాస్త ఆల‌స్య‌మైనా అభిమానుల్ని అల‌రించే అప్‌డేట్ తో రావాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.అదేమిటంటే ఈ సినిమాకు గోల్డ్‌ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారట.ఈ మూవీ స్టార్ట్ చేయడానికి ముందే.. ఈ సినిమాలోని క్యాస్టింగ్ , మూవీ స్టోరీ లైన్ లాంటి వివరాలకు సంబంధించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని.. ఆ తర్వాత రాజమౌళి ఓ వర్క్ షాప్ నిర్వహిస్తారని.. ఆ తర్వాతే మూవీ సెట్స్ పైకి వెళ్తుందని టాక్ నడుస్తుంది. మరి ఇప్పుడు వినిపిస్తున్న ‘గోల్డ్’ అనే మూవీ టైటిల్ ను మహేష్ బర్త్ డే రోజు ప్రకటిస్తారా ! లేదా దీనిని వర్కింగ్ టైటిల్ గా కన్సిడర్ చేస్తారా ! ఈ విషయాలన్ని తెలియాలంటే.. మేకర్స్ నుంచి ఎదో ఒక అఫీషియల్ అప్ డేట్ రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: