ఎన్టీఆర్ ను ఆ పేరుతో పిలిస్తే పిచ్చ కోపం వస్తుందా..? కారణం ఏంటంటే..?

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు ప్రేక్షకులందరీ మనసులు గెలుచుకొని మహానటుడిగా పేరు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి విశ్వ విఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు.. ఎన్టీఆర్ కు తారక రామ్ అని నేను పేరు పెట్టానని నాన్నకు ప్రేమతో  ఆడియో లాంచ్ సందర్భంగా హరికృష్ణ వెల్లడించారు. అయితే ఓ రోజు నాన్నగారు నన్ను పిలిచి అవున్రా నీ చిన్న కొడుకు ఎక్కడరా చూడక చాలా రోజులైంది వాడిని చూడాలనిపిస్తుంది ఒకసారి తీసుకొని రా అని అడగ్గా.. వెంటనే నేను నాన్నగారి దగ్గరికి తారక్ ను తీసుకొని వెళ్ళాను. అప్పుడు నాన్నగారు మీ పేరు ఏంట్రా అని అడగ్గా నేను వెంటనే నా పేరు తారక్ తాతగారు అని నాన్నగారే నాకు ఆ పేరు పెట్టాడని తెలిపాడు. వెంటనే లేదురా నువ్వు అచ్చం నా రూపం నా పేరే నీకు ఉండాలి అంటూ ఈ రోజు నుంచి నీ పేరు తారక్ కాదు నందమూరి తారక రామారావు అనిగా అని తారక్ పేరు మార్చారు, ఇక అప్పటినుండే తారక్ కు ఎన్టీఆర్ అనే పేరుతో పేరు పెట్టి పిలవడం మొదలయ్యింది.ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో దాదాపు అందరూ హీరోస్‌కి నిక్‌నేమ్స్ ఉంటాయి. అల్లు అర్జున్‌కు బన్నీ, ప్రభాస్‌కు డార్లింగ్‌, రామ్ చరణ్ కు చెర్రీ, బాలకృష్ణకు బాలయ్య, చిరంజీవికి చిరు ఇలా నిక్ నేమ్స్ ఉన్నట్లే.. జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా ఎన్నో నిక్ నేమ్స్ ఉన్నాయి.అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ గురించి మరొక ఆసక్తికరమైన వార్త కూడా నెట్టింట హల్చల్ అవుతుంది.అందులో భాగంగానే  ఎన్టీఆర్‌ని బుడ్డ ఎన్టీఆర్ అని మొదట్లో కొంతమంది పిలిచేవారు. ఎన్టీఆర్‌కు అలా పిలిస్తే అసలు నచ్చదట. హైట్ రిత్యా కావాలనే అలా నీకు నేమ్‌ పెట్టారు. అయితే ఆ పేరు ఎన్టీఆర్‌కు అసలు నచ్చదట.. దీనిపై చిరాకు వచ్చిన ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య సినిమాలో ఇన్ డైరెక్ట్ గా ఓ డైలాగ్ రూపంలో అలా పిలిచే వారందరికీ వార్నింగ్ ఇచ్చారని టాక్‌. ఆ డైలాగ్ రూపంలో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రతివాడు బుడ్డోడు బుడ్డోడు అంటే బుట్టలు తీసి కొడతా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అలా పిలవాలంటే అర్హత ఉండాలి. లేదా నా అభిమానై ఉండాలి అంటూ తారక్ చెప్పిన డైలాగ్ అప్పట్లో తెగ వైరల్‌గా మారింది. ఆ డైలాగు ఎన్టీఆర్ కావాలనే ఎవరినో ఉద్దేశించి అన్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అయితే పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరో అయిపోయిన సంగతి మనందరం కి తెలిసిన విషయమే.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: