మళ్లీ తమిళ్ క్రేజీ హీరోతో సినిమా సెట్ చేసిన సుధా కొంగర..?

Pulgam Srinivas
తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న మహిళ దర్శకురాలిలో సుధా కొంగర ఒకరు. ఈమె కెరియర్ బిగినింగ్ లో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన కొంత కాలం క్రితం సూర్య హీరో గా రూపొందిన సూరారై పోట్రు మూవీ తో ఈమెకు దర్శకురాలి గా అద్భుతమైన గుర్తింపు లభించింది . ఇకపోతే ఈ సినిమాను తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ మూవీ తమిళ్ , తెలుగు రెండు భాషలలో కూడా థియేటర్ లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది.

ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాను హిందీ లో సర్ఫేరా అనే టైటిల్ తో అక్షయ్ కుమార్ హీరో గా సుధా కొంగర తెరకెక్కించింది. జూలై 12 వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకున్న కలెక్షన్ ను మాత్రం పెద్ద స్థాయిలో రాబట్టడం లేదు.

దానితో ఈ మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో నష్టాలే మిగిలే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే ఈమె తాజాగా మరో తమిళ హీరో తో సినిమా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు , ఇప్పటికే ఈ మూవీ కి సంగీత దర్శకుడిగా జీ వి ప్రకాష్ కుమార్ ను ఎంపిక చేసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: