బాహుబలి లాంటి భారీ సినిమాతో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్న
డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాతో పాన్
ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.ఈ
సినిమా నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా పాన్
ఇండియా సినిమాల ట్రెండు మొదలైంది.బాహుబలి
సినిమా తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలతో అభిమానులను నిరాశపరిచినప్పటికీ సలార్,
కల్కి డబుల్ ట్రీట్ ఇచ్చాడు.ప్రస్తుతం ఇండియాలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో
ప్రభాస్ కూడా ఒకరు. దాదాపు 10 ఏళ్లుగా
ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అదిగో అప్పుడే
పెళ్లి ఇదిగో ఇప్పుడే
పెళ్లి అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే కాలం గడిచిపోతుంది. కానీ ఇప్పటికీ
ప్రభాస్ మనసులో ఎవరున్నారో మాత్రం తెలియలేదు. కానీ ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్
క్రష్ గురించి
ప్రభాస్ రివీల్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ ఫస్ట్
క్రష్ అంటే అందరూ త్రిషనో లేక అనుష్కనో లేదా ఆయన క్లాస్మేటో అనుకుంటారు.. ఇక మరికొంతమంది
బాలీవుడ్ హీరొయినో లేక తమ చుట్టాల అమ్మాయో కావచ్చు అని అనుకుంటారు. కానీ మీరందరూ అనుకుంటున్నట్టు
ప్రభాస్ ఫస్ట్
క్రష్ హీరోయిన్ లేదా ఆయన క్లాస్మేట్ కాదు.మరి ఆయన ఫస్ట్
క్రష్ ఎవరో తెలిస్తే మీరందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే.అంతే కాదు
ప్రభాస్ మామూలోడు కాదు భయ్యా అని అనుకోవాల్సిందే.మరి ఇంతకీ
ప్రభాస్ ఫస్ట్ కష్ ఎవరో ఇప్పుడు చూద్దాం.ఇక
ప్రభాస్ ఫస్ట్
క్రష్ ఎవరో కాదు ఓ టీచరమ్మ అవును మీరు వినేది నిజమే.స్కూల్ టైం లోనే ఓ టీచర్ ని చాలా ఇష్టపడ్డారట ప్రభాస్.ఆ టీచర్ ని చూడడంతోనే
ప్రభాస్ కి ఫస్ట్
లవ్ పుట్టిందట.అయితే ఆ టీచర్ పేరు మాత్రం గుర్తు లేదట.కానీ ఆ టీచర్ మాత్రం చాలా అందంగా ఉండేదట. ఇక ఆ టీచరే నా ఫస్ట్
క్రష్ అంటూ
ప్రభాస్ ఆ ఇంటర్వ్యూలో చాలా నవ్వుతూ మొహం అంతా వెలిగిపోతూ మాట్లాడారు.ఇక ఈ విషయం తెలిసిన వారంతా..
డార్లింగ్ ఇలాంటి చిలిపి చేష్టలు కూడా చేశాడా? అని అంటున్నారు.