రకుల్ ఉంటే సీక్వెల్స్ చూడమంటున్న నెటిజన్స్.. కారణం అదేనా..?

murali krishna
తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో సూపర్ హిట్‌ అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్. జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌, మహేశ్ బాబు, రవితేజ, నాగార్జున లాంటి టాలీవుడ్‌ స్టార్ హీరోలతో నటించి వన్ ఆఫ్‌ ది లీడింగ్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. రకుల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో యాక్టర్ కమ్‌ ప్రొడ్యూసర్‌ జాకీభగ్నానీ (బాయ్‌ ఫ్రెండ్‌)తో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిందని తెలిసిందే. కాగా పెండ్లి తర్వాత ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌తో మళ్లీ బిజీ అయిపోయినట్టు తాజా అప్‌డేట్ చెప్పకనే చెబుతోంది.రకుల్ ప్రీత్ సింగ్ హవా ప్రస్తుతం సౌత్ లో బాగా తగ్గిపోయింది. నార్త్ లో మాత్రమే ఆమెకి ఒకటి అరా అవకాశాలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత కూడా రకుల్ సినిమాలు చేస్తోంది. కానీ సౌత్ లో మాత్రం ఆమెకి ఆఫర్స్ రావడం లేదు. రకుల్ చివరగా తెలుగులో కొండపొలం అనే చిత్రంలో నటించింది.ఇటీవల రకుల్ కీలక పాత్రలో నటించిన భారతీయుడు 2 విడుదలైంది. ఈ చిత్రం శంకర్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలింది. భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత రకుల్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. కొందరు నెటిజన్లు రకుల్ ని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. కొత్త వాదనని తెరపైకి తీసుకువస్తున్నారు. భారతీయుడు 2 చిత్రంలో ఆమె నటించింది అంతే.. రిజల్ట్ తో రకుల్ కి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఆమెని టార్గెట్ చేస్తున్నారు. సీక్వెల్స్ చిత్రాల్లో రకుల్ నటిస్తే ఆ మూవీ ఫ్లాపే అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
రకుల్ నటించిన ప్రతి సీక్వెల్ చిత్రం డిజాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారు. రకుల్ నటించిన కిక్ 2, మన్మథుడు 2, భారతీయుడు 2 ఇలా ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్లు నెటిజన్లు చెబుతున్నారు.ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కథ, కథనం.. ఇలా రకరకాల కారణాలు ఉన్నా ఈ మూడు సినిమాలకు కామన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఉండటంతో రకుల్ ఉంటే సీక్వెల్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇలాంటి కామెంట్స్ గతంలో కూడా పలువురు హీరోయిన్స్ కి వచ్చాయి. ఫ్లాప్, హిట్ అనేవి ఏ సెంటిమెంట్ తోను ఆధారపడి ఉండకపోయినా కామన్ గా ఒక రెండు, మూడు సినిమాల్లో కనిపిస్తే హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్.. ఇలా ఎవరికో ఒకరికి ఆ ఫ్లాప్స్ ని అంటగడతారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకి అయినా నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ లాగే ఇది కూడా. ఇక రకుల్ ప్రస్తుతం ప్రేమించి పెళ్లి చేసుకొని భర్త జాకీ భగ్నానీతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: