మహరాజ నటుడు పార్ట్ టైం యాక్టర్.. అతను ఒకప్పుడు ఏం చేశాడో తెలుసా..?

shami
విజయ్ సేతుపతి హీరోగా నిథిలన్ స్వామినాథన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా మహారాజ. లాస్ట్ మంత్ థియేట్రికల్ రిలీజై సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు అందుకుంది. అయితే డిజిటల్ రిలీజ్ లో కూడా సినిమా ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాగా ఓటీటీ వెర్షన్ లో కూడా బాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ సేతుపతి మహారాజ సినిమా నెట్ ఫ్లిక్ టాప్ లిస్ట్ లో నాల్గవ ప్లేస్ లో నిలిచింది.
ఐతే ఈ సినిమాలో నటించిన వారంతా బాగా చేశారు. ఐతే ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ గా చేసిన నటరాజన్ సుబ్రమణియం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో అతను రివీల్ చేసిన సీన్ అయితే అదిరిపోతుంది. ఐతే ఇతన్ని మనం ఈ సినిమాలో యాక్టర్ గా చూశాం కానీ నటరాజన్ సుబ్రమణియం ఒకప్పుడు ఒక పెద్ద సినిమాటోగ్రాఫర్. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన కెమెరా మెన్ గా పనిచేశారు. జబ్ వీ మెట్ నుంచి లవ్ ఆజ్ కల్, నాక్ అవుట్, పరిణీత లాంటి సినిమాలకు ఆయన సినిమాటోగ్రఫీ చేశారు.
తెలుగులో కూడా త్రివిక్రం నిర్మాణంలో కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వచ్చిన ఛల్ మోహన్ రంగ సినిమాకు కెమెరా మెన్ గా చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ కెమెరా వర్క్ బాగానే ఉంటుంది. ఐతే కెమెరా మెన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటరాజన్ ఇప్పుడు కోలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారాడు. అతను చేస్తున్న సినిమాలు అన్ని సక్సెస్ అవ్వడంతో మళ్లీ మళ్లీ ఛాన్సులు వస్తున్నాయి. ఇలా ఒక సినిమాటోగ్రాఫర్ సక్సెస్ ఫుల్ నటుడిగా మారడం ఆయన వల్లే సాధ్యమైంది. మహారాజ చూశాక తెలుగు దర్శకులు కూడా ఆయన పై ఒక కన్నేశారని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: