రాబోయే కాలం ఎన్టీఆర్, బన్నీదేనా?

Suma Kallamadi
ఎన్టీఆర్, అల్లు అర్జున్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టార్ డం విషయంలో ఇద్దరూ ఇద్దరే. rrr సినిమాతో ఎన్టీఆర్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఏకంగా పాన్ ఇండియా సినిమా హీరోలు అయిపోయారు. ఇక బన్నీకి కేరళలో చాలా ప్రత్యేక ట్రీట్ ఉంటుంది. బన్నీ సినిమా అక్కడ రిలీజ్ అయితే ఓ పెద్ద హీరోకి వచ్చిన ఓపెనింగ్స్ వస్తాయి అన్న విషయం విదితమే. ఇంతకంటే వారి ఫాలోయింగ్ గురించి చెప్పడానికి ఏముంది? అయితే పుష్ప తరువాత బన్నీ, rrr సినిమా తరువాత ఎన్టీఆర్.. మరో సినిమాని రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే వారి అభిమానులు వారి నుండి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురు చూస్తున్న పరిస్థితి.
ఈ తరుణంలోనే ఓ శుభవార్త వినబడుతోంది.  రాబోయే సంవత్సరాలలో ఇద్దరి సినిమాలు సంవత్సరానికి కనీసం రెండు సినిమాలను రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నట్టు సమాచారం. ఆ రకంగానే వారి ప్రణాళికలు సాగుతున్నట్టు కనబడుతోంది. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీ కాగా, ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో దేవర షూటింగులో బిజీగా ఉన్నాడు. అయితే ఈ రెండింటికి ఎక్కువ సమయం కేటాయించిన వీరు ఇకపై అలా ఎక్కువ సమయం మరే సినిమాకి కేటాయించలేము అని మేకర్స్ తో తెగేసి చెప్పినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అదే షరతులకు లోబడి ఇపుడు తరువాతి సినిమాలు చేయనున్నారు.
ఎన్టీఆర్ దేవర తరువాత వరుసగా.. ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు సాన సినిమాలను చేయనున్నాడు. మరో పక్క బాలీవుడ్ మూవీ 'వార్' ఉండనే ఉంది.. ఈ మూడు సినిమాలు ఒకే సంవత్సరంలో వచ్చేటట్టు ప్లాన్ చేయనున్నాడు ఎన్టీఆర్. అదేవిధంగా బన్నీ తన తదుపరి సినిమాలను పక్క ప్లాన్ తో చేయనున్నాడని వినికిడి.. బన్నీ పుష్ప 2 తరువాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా సినిమాలను లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.. అంతేకాకుండా మరికొంతమంది డైరెక్టర్లను లైన్లో పెట్టినట్టు సమాచారం.. ఇకపై రెండు సంవత్సరాలకు ఒక సినిమా కాకుండా.. సంవత్సరానికి రెండు మూడు సినిమాలను విడుదల చేయడానికి వీరు సన్నాహాలు చేయనున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి... కాబట్టి రాబోయే కాలం ఎన్టీఆర్, బన్నీదేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: