పోటీకి సై అంటున్న సీనియర్ హీరోలు.. విజయం ఎవరిది..?
అందుకే ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. సంక్రాంతి డేస్ అంటే సినిమాలకు గోల్డెన్ డేస్ లాంటివి. రానున్న సంక్రాంతి కూడా బాక్స్ ఫీస్ వద్ద సినిమాల హడావిడి ఒక రేంజ్ లో సాగేలా కనిపిస్తుంది. 2025 సంక్రాంతి సినిమాల రిలీజ్ కోసం ఇప్పటి నుండే కర్చీఫ్ వేస్తున్నారు బడా సినిమాల నిర్మాతలు. ఇప్పటికే మెగాస్టార్ చిరు హీరోగా వశిష్ట దర్శకత్వంలో వస్తున్న 'విశ్వంభర' సంక్రాంతి డేట్ లాక్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది ఈ చిత్రం. ఇక మరో స్టార్ హీరో సంక్రాంతి స్టార్ అని పేరున్న నందమూరి బాలకృష్ణ, బాబి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.
మొదట డిసెంబరు విడుదల అనుకున్నారు కానీ అక్కడ స్లాట్ దొరకనందున సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'వీరమాస్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వీరితో పాటు విక్టరీ వెంకీ అనిల్ రావిపూడి తాజా సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని పూజా కార్యక్రమంతో షూటింగ్ మొదలెట్టిన రోజే ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇలా టాలీవుడ్ టాప్ హీరోలు ముగ్గురు సంక్రాంతికి రానుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి ఈ సారీ సంక్రాంతి పోటీలో ఏ పుంజు గెలుస్తుందో చూడాలి.