టాలీవుడ్ లో కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి బ్యూటీ.. అనూహ్యంగా మూవీలకి దూరం..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకొని స్టార్ హీరోయిన్ లుగా కెరియర్ గా కొనసాగిస్తున్న సమయంలో కూడా కొంత మంది నటీమణులు బాలీవుడ్ పై మోజుతో అపై అడుగులు వేసి కెరియర్ ను అయోమయంలో పడేసుకున్నవారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో గోవా బ్యూటీ ఇలియానా కూడా ఒకరు. ఈ ముద్దు గుమ్మ రామ్ పోతినేని హీరోగా వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు మూవీ లో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తోని మంచి విజయాన్ని సూపర్ క్రేజ్ ను ఈ బ్యూటీ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఈ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయి కి ఇలియానా వెళ్ళింది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా క్రేజీ అవకాశాలు దక్కడం , అందులో చాలా మూవీ లు అద్భుతమైన విజయాలు అందుకోవడంతో ఈమె తన రెమ్యూనికేషన్ ను కూడా భారీగా పెంచేసింది. ఇక ఈమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా రవితేజ హీరోగా రూపొందిన ఖతర్నాక్ మూవీ కోసం ఈమె ఏకంగా కోటి రూపాయలు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్ గా చరిత్ర సృష్టించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అంతలా క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగులో కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. కానీ అక్కడ ఈమెకు అవకాశాలు కొన్ని వచ్చిన అవి పెద్దగా సక్సెస్ కాలేదు. దానితో ఈమె కెరియర్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. ఇక ప్రస్తుతం ఈయనకు తెలుగులో సినిమాలు లేవు. అటు హిందీ లో కూడా పెద్దగా ఆఫర్లు లేవు. కోటి రూపాయల పారితోషకం తీసుకొని చరిత్ర సృష్టించిన ఈ బ్యూటీ కి ఆఫర్లు లేకపోవడం అనేది పెద్ద విషయం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: