విశ్వంభర : ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా.. టీజర్ వచ్చేస్తుంది..!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్‌ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. హైలీ యాంటిసిపేటెడ్‌ క్రేజీ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తుంది. చిరంజీవి సరసన త్రిష నాయికగా నటిస్తున్న ఈ మూవీలో ఆషికా రంగనాథ్‌, కునాల్ కపూర్‌లు ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలో విశ్వంభర షూటింగ్‌కు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవికెరీర్ లో 156వ చిత్రం ‘విశ్వంభర’. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి చిత్రాల తర్వాత చిరు నటిస్తు్న్న సోషియో ఫాంటసీ చిత్రం ఇదే అవడంతో దీనికి మంచి హైపు క్రియేట్ అయింది.ఇటీవల ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ఇంకా క్లైమాక్స్, మూడు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నాయి.నిజానికి విశ్వంభర చిత్రం లాంచింగ్ టైమ్ లో రిలీజైన టైటిల్ టీజర్  చిరు మూవీ కోసం చేస్తున్న వర్క్ అవుట్ వీడియో  తప్ప.. ఆ తర్వాత ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ మూవీలోని చిరంజీవి లుక్ అన్ అఫీషియల్ గా వివిధ సందర్భాల్లో రివీల్ అయిపోయింది. అయినప్పటికీ... మెగా ఫ్యాన్స్ విశ్వంభర చిత్రం నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ ను ఆశిస్తున్నారు. దానికి సమయం ఆసన్నమైందని తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం..వచ్చే నెల అంటే ఆగస్టు 22న మెగాస్టార్ చిరు బర్త్ డే. ఈ సందర్భంగా విశ్వంభర సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా అన్ని పనులు పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2025 జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో చెప్పారు.ఈ సినిమాలో చిరంజీవి హనుమాన్ కి గొప్ప భక్తుడి గా కనిపించునున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: