వెబ్ సిరీస్లపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన స్టార్ బ్యూటీస్ వీరే..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం వెబ్ సిరీస్ లలో నటించడానికి స్టార్ హీరోయిన్లు పెద్దగా ఆసక్తి చూపించే వారు కాదు. కానీ ప్రస్తుతం కాలం మారింది. ప్రేక్షకులు సినిమాలపై ఏ స్థాయిలో ఆసక్తిని చూపిస్తున్నారో వెబ్ సిరీస్ లను చూడడానికి కూడా అదే రేంజ్ లో ఆసక్తిని చూపిస్తున్నారు. దానితో స్టార్ హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లి ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ హల్చల్ చేస్తున్న బ్యూటీ లు ఎవరో తెలుసుకుందాం.
తమన్నా :  ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కూడా చాలా సంవత్సరాలు కెరీర్ ను కొనసాగించింది. ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ వరుస సినిమాలలో నటిస్తోంది. సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా ఈమె వీలు చిక్కినప్పుడల్లా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ఇప్పటికే ఈమె అనేక వెబ్ సిరీస్ లలో నటించింది.
సమంత :  నాగ చైతన్య హీరో గా రూపొందిన ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను , అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడంతో చాలా తక్కువ సమయంలోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలు అద్భుతమైన గుర్తింపు ఉంది. ఇలా సినిమాల్లో అవకాశాలు వరుసగా వస్తున్న సమయంలో ఈమె ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ప్రస్తుతం కూడా సమంత పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఇలా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తూనే ఈ ముద్దు గుమ్మ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: