దసరా కు రాలేకపోతున్న టాలీవుడ్ !

Seetha Sailaja
ఎన్నికలు ఐపిఐఎల్ టోర్నమెంట్ ఇలా రకరకాల కారణాలతో మూడు నెలల సమ్మర్ సీజన్ ను మిస్ చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ తన కళను కోల్పోయింది. అన్ సీజన్ లో వచ్చిన ‘కల్కి2898’ కలక్షన్స్ విషయంలో సంచలనం సృష్టించడంతో ఇక ఈకళ రాబోతున్న దసరా సీజన్ కు కూడ కొనసాగే ధియేటర్లు ఊపిరి పీల్చుకుంటాయి అని అంతా భావించారు.

అయితే రకరకాల కారణాలతో అక్టోబర్ 10న రాబోతున్న దసరా పండుగకు మన తెలుగు సినిమాల సందడి లేకుండా డబ్బింగ్ సినిమాల హడావిడితో దసరా సీజన్ పూర్తి అయ్యే ఆస్కారం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. దసరా పండుగ అంతా తమిళ డబ్బింగ్ సినిమాల హదావీడితో పూర్తి అయ్యేలా కనిపిస్తోంది. తమిళ ఫిలిమ్ ఇండస్ట్రీ తమిళ ‘బాహుబలి’ గా ఆకాశానికి ఎత్తెస్తున్న సూర్య ‘కంగువ’ దసరా ను టార్గెట్ చేస్తూ విడుదలకాబోతోంది.

వాస్తవానికి ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఈమూవీ పై తెలుగు ప్రేక్షకులలో కూడ చాలమంచి అంచనాలు ఉన్నాయి. ఇక అదే దసరా ను టార్గెట్ చేస్తూ రజనీకాంత్ ‘వెట్టయాన్’ కూడ విడుదల కాబోతోంది. ఈమూవీ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ కు తెలుగు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీ కూడ ‘జైలర్’ మూవీ లానే హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇలా తమిళ సినిమాలు తమ రిలీజ్ డేట్ ను చాల ముందుగా ప్రకటిస్తూ దసరా డేట్ ను కబ్జా చేస్తూ ఉంటే తెలుగు సినిమాలు ఏవీ ఇప్పటివరకు దసరా ను టార్గెట్ చేస్తూ విడుదల తేదీని ప్రకటించక పోవడం షాకింగ్ గా మారింది.

వాస్తవానికి దసరా కు రెండు వారాలు ముందు సెప్టెంబర్ 27న జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ విడుదల కావలసి ఉంది అయితే ఇప్పుడు మళ్ళీ రకరకాల కారణాలతో ఈమూవీ విడుదల వాయిదా పడుతుంది అంటూ గాసిప్పులు గుప్పుమంటున్నాయి. ఈ వార్తల పై ఈసినిమా యూనిట్ కూడ మౌనం వహిస్తూ ఉండటంతో ఇది నిజమే అన్నసందేహాలు వస్తున్నాయి. రాబోతున్న దశరా కు టాలీవుడ్ హడావిడి లేనట్లే అన్న మాటలు వినిపిస్తున్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: