రెండోసారి ఆ పాన్ ఇండియా స్టార్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం సలార్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక పోయిన సంవత్సరం సలార్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఈ సంవత్సరం కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ప్రస్తుతం కూడా ఈ మూవీ అద్భుతమైన రీతిలో కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబడుతుంది.

ఇకపోతే ప్రభాస్ , హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హను రాఘవపూడి , ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని పనులను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి మృణాల్ ఠాకూర్ , ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ప్రభాస్ తాజాగా నటించిన కల్కి సినిమాలో మృణాల్ ఓ చిన్న పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఈమె కనిపించింది చాలా తక్కువ సమయమే అయిన ఈమె పాత్రకు మంచి స్కోప్ ఉండడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ నటి హను రాగవపూడి ఆఖరుగా దర్శకత్వం వహించిన సీత రామం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే ఈమె తెలుగు పరిచయం అయ్యింది. ఈ మూవీ తో ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ గుర్తింపును సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: