కంగువ నుంచి క్రేజీ అప్డేట్.. సూర్య ఏకంగా అన్ని గెటప్స్లో కనిపిస్తారా..?

murali krishna
సినీ ఇండస్ట్రీలో నట వారసులుగా వచ్చి సక్సెస్ అయిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో తమిళ స్టార్ హీరో సూర్య ఒకరు. విలక్షణమైన తన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో అయ్యారు.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య  నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి కంగువ . సూర్య 42వ ప్రాజెక్ట్‌గా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానిక శివ  దర్శకత్వం వహిస్తున్నాడు.కంగువలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. బాబీ డియోల్ ఉధిరన్‌ పాత్రలో నటిస్తున్నాడు.కంగువ రెండు పార్టులుగా రాబోతుండగా.. కంగువ పార్టు 1 అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే లాంచ్ చేసిన కంగువ గ్లింప్స్ ‌ వీడియో, పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి.స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ సుమారు 38 భాషల్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.తాజాగా ఈమూవీకి సంబంధించిన ఓ సెన్సేషన్ న్యూస్ ఫిలిమ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న కంగువా మూవీ కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.ఈ మూవీలో సూర్య మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఈ మూడు పాత్రల కోసం సూర్య తన లుక్ ని మార్చుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన నటించిన మూడు పాత్రలు ‘కంగువ’ కథ అదిరిపోయే ట్విస్ట్ ని తీసుకువస్తుందని ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఇటీవల కంగువా నుంచి సూర్య రెండు లుక్ లు రివీల్ చేసిన విషయం తెలిసిందే.లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం నుండి ఫైర్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. జూలై 23 వ తేదీన ఈ సాంగ్ రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: