మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో.. కథ కూడా సెలెక్టెడ్..??

Suma Kallamadi

సాధారణంగా ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబంలో నుంచి చాలా మంది హీరోలు, హీరోయిన్లు వస్తుంటారు ఉదాహరణకి మెగా ఫ్యామిలీనే తీసుకోండి. మొదటగా చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ వైష్ణవ్‌ తేజ్, నిహారిక కొణిదల వారు ఉంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. టాలెంట్ ఉన్నవారు సక్సెస్ అయ్యారు లేనివారు ఫెడౌట్ అయిపోయారు.
నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా చాలామంది ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు కూడా వచ్చారు. అప్పట్లో రమేష్ బాబు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ ఎందుకో సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు అతని కుమారుడు జయకృష్ణ హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణకు మనవడు అవుతాడు. రమేశ్‌బాబు నిర్మాతగా కూడా పనిచేశారు.
జులై 19న జయకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం పద్మాలయా కంపెనీ ఆఫీసులో కేక్ కట్ చేశాడు. ఈ పుట్టినరోజు పార్టీలో ఘట్టమనేని అభిమానులు పార్టిసిపేట్ చేశారు. వారి సమక్షంలో జయకృష్ణ కేక్‌ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నాడు. ఈ పార్టీలో పాల్గొన్న
దివంగత రమేశ్‌బాబు భార్య, జయకృష్ణ తల్లి మృదుల అతడి సినిమా ఇంట్రడక్షన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జయకృష్ణ కోసం ఆల్రెడీ కొన్ని సినిమా స్క్రిప్ట్స్ వినేశాం. అందరికీ ఒక కథ బాగా నచ్చింది దానిని సెలెక్ట్ చేశాం. ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఆ కథతో జయకృష్ణను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తాం.’ అని మృదుల చెప్పారు. అభిమానులందరికీ జయకృష్ణ థాంక్స్ చెప్పుకున్నారు. వారు ఇతడికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. మరి ఈ హీరో ఎలాంటి కథతో ప్రజల ముందుకి వస్తున్నాడో తెలియాల్సి ఉంది. మరోవైపు సుధీర్ బాబు కుమారుడు కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ హీరో మెటీరియల్ గా కనిపిస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లో ఘట్టమైన ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ వలె అరడజను దాకా హీరోలు అవతరించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: