విజయ దళపతి ఎత్తుకున్న.. ఈ చిన్నోడు స్టార్ హీరోయిన్ కొడుకా..?

Divya
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం గోట్.. డైరెక్టర్ వెంకట ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తున్నది.. లియో చిత్రం తర్వాత భారీ బడ్జెట్ చిత్రంతో ఈ సినిమాలో నటిస్తున్నారు విజయ్ దళపతి.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెనడాలో జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా విజయ్ ని ప్రముఖ హీరోయిన్ రంభ ఇంటికి ఆహ్వానించగా విజయ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా  గడిపినట్టుగా తెలుస్తోంది..

ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం రంభ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారుతున్నాయి. చాలా కాలం తర్వాత తనకు ఇష్టమైన హీరోని కలిశానంటూ రంభ ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రంభ ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందుకున్న ఈమె తెలుగు తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించింది. పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించింది రంభ.

వివాహమైన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఆక్టివ్ గా ఉంటూ తనకు తన కుటుంబానికి సంబంధించిన ఎలాంటి విషయాలనైనా సరే షేర్ చేస్తూ ఉంటుంది. ఇక రంభ షేర్ చేసిన ఫోటల విషయానికి వస్తే రంభ కుమారుడుని విజయ దళపతి ఎత్తుకున్నప్పటి ఫోటోని సైతం షేర్ చేయగా హీరోయిన్ రంభ కు ఇంత పెద్ద కుమారుడు ఉన్నారా అంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. హిరోయిన్ రంభ తన కుమారుడిని హీరోగా చేస్తే బాగుంటుంది అంటూ అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తనని కూడా రీయంట్రీ ఇవ్వాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: