
త్వరలో హిట్ - 3 ప్రారంభం.. ఇంతకీ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఇక ఈ సినిమా ను ప్రస్తుతం సిరీస్గా తెరకెక్కిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. హిట్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక ఈ మూవీకి సీక్వల్గా హిట్ 2 వచ్చి కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే హిట్ 2 లో ఇక మూడవ పార్ట్ లో నాని ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు అనే విషయాన్ని డైరెక్టర్ చెప్పగానే చెప్పేశారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పార్ట్ 3 ఎప్పుడు రాబోతుందో అనే విషయంపై అభిమానులు అందరిలో కూడా ఎంతగానో ఆసక్తి ఉంది అని చెప్పాలి. కొత్త డైరెక్టర్ శైలేష్ కొలను తన టేకింగ్ తో ప్రేక్షకులు అందరిని కూడా ఫిదా చేసేసాడు.
అయితే హిట్ పార్ట్ 1 పార్ట్ 2 సినిమాలతో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్న శైలేష్ కొలను ఆ తర్వాత వెంకటేష్ తో ఒక మూవీ చేశాడు అయితే ఈ మూవీ డిజాస్టర్ గానే మిగిలిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న హిట్3 మూవీ ఎలా ఉండబోతుందో అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో కే జి ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.