తన రికార్డును తానే బద్దలు కొట్టిన ప్రభాస్.. ఏకంగా ఒక్కరోజే అన్ని కోట్లు..!

Pulgam Srinivas
తాజాగా ప్రభాస్ కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ... అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృణాల్ ఠాకూర్ , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

దిశా పటాని ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ కే వి ఈ సినిమాలో చిన్న చిన్న క్యామియో పాత్రలలో కనిపించారు. ఇకపోతే ఈ సినిమా నిన్నటితో ప్రపంచ వ్యాప్తంగా 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. 18 వ రోజు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. దానితో ప్రభాస్ ఇది వరకు తన సినిమాల పేరు మీద ఉన్న రికార్డును చెరిపి మరోసారి కొత్త రికార్డును సృష్టించాడు.

ఇది వరకు విడుదల అయిన 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో బాహుబలి 2 సినిమా 2.60 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో ఉండగా ... బాహుబలి మొదటి భాగం 1.45 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో ఉంది. ఇకపోతే తాజాగా ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి సినిమా విడుదల అయిన 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.84 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఇలా ప్రభాస్ తాను హీరోగా రూపొందిన సినిమాల రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డును సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: