వామ్మో! సంతోషం హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది?

Purushottham Vinay

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కూడా కేవలం ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. తమ అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ డమ్ సంపాదించుకుని.. ఆ తర్వాత కనిపించకుండాపోయారు. కేవలం ఒకటి రెండు చిత్రాల్లో మెరిసి ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. అలాంటి వారిలో గ్రేసీ సింగ్ ఒకరు. ఈ పేరు చెబితే ఎవరు గుర్తుపట్టలేరు. కానీ కింగ్ నాగార్జున నటించిన సంతోషం మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమా పేరు చెప్పగానే అందం, అమాయకత్వం కలిసిన ఓ రూపం అడియన్స్ కళ్లముందుకు వస్తుంది. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ సినిమాల్లో సంతోషం సినిమా ఒకటి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాల్లో శ్రియా శరణ్, గ్రేసీ సింగ్ హీరోయిన్లుగా నటించగా.. ప్రభుదేవా, విశ్వనాథ్ ఇంకా పృథ్వీ కీలకపాత్రలు పోషించారు. 


ఈ మూవీలో నాగార్జున, గ్రేసీ సింగ్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దీంతో ఈ సినిమా తర్వాత తెలుగులో ఆ బ్యూటీకి ఆఫర్స్ వస్తాయనుకున్నారు అంతా.. కానీ అలా మాత్రం కాలేదు. సంతోషం సినిమా తర్వాత మోహన్ బాబు, శ్రీకాంత్ కలిసి నటించిన తప్పుచేసి పప్పు కూడు సినిమాలో ఆమె నటించింది. ఇక ఆ తర్వాత ఆమె మరో మూవీ చేయలేదు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిలం, మలయాళం, పంజాబీ చిత్రాల్లో మెరిసిన గ్రేసీ సింగ్..ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది.ఇక హిందీలో అమీర్ ఖాన్ సరసన గ్రేసీ సింగ్ నటించిన లగాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో గ్రేసీ నటనకు నార్త్ అడియన్స్ ముగ్దులయ్యారు. ఆ తర్వాత గంగాజల్, మున్నాబాయ్ ఎంబీబీఎస్ చిత్రాల్లో ఆమె నటించింది. ఇక చివరిసారిగా 2015లో ఓ పంజాబీ సినిమాలో ఆమె కనిపించింది.ఇక గ్రేసీ సింగ్ ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. స్వతహాగా భరతనాట్యం డ్యాన్సర్ అయిన గ్రేసీ సింగ్.. తన పేరిట గ్రేసీ సింగ్ డ్యాన్స్ ట్రూప్ ప్రారంభించి దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలు కూడా చేస్తుంది. ఇంకా అలాగే బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో సభ్యురాలిగా ఉంటూ తరచూ పలు సేవా కార్యక్రమంలో పాల్గొంటుంది.ఇంకా అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆమె తాజాగా కొన్ని ఫోటోస్ షేర్ చేయగా.. గ్రేసీ సింగ్ లేటేస్ట్ లుక్ చూసి ఆశ్యర్యపోతున్నారు ఆమె ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: