"ఇండియన్ 2" తో ఆ లిస్టులోకి శంకర్.. "గేమ్ చేంజేర్" తో బయటపడేనా..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీ అన్నాక హిట్లు , ఫ్లాపులు అనేవి సర్వసాధారణం. కొన్ని సందర్భాలలో దర్శకులు వరస విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తూ ఉంటారు. అలా అద్భుతమైన విజయాలను అందుకుంటు ఇండస్ట్రీ లో టాప్ స్థాయికి వెళ్ళిన కొంత మంది దర్శకులు కూడా కొన్ని సందర్భాలలో వరుసగా అపజాయలను అందుకుంటుంటారు. ఇక అలా అపజయాలు ఎదురవుతున్న సమయంలో వారు విజయాల కోసం మళ్లీ గట్టిగా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో శంకర్ ఒకరు.

ఈయన తన కెరియర్ ప్రారంభించినప్పటి నుండి చాలా సంవత్సరాల వరకు అపజయం అంటే తెలియకుండా తన కెరీయర్ ను ను ముందుకు సాగించాడు. ఇకపోతే ఈయన తన సినిమాలతో ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి దర్శకుడు ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాలను అందుకోవడం లేదు. ఆఖరుగా ఈయన దర్శకత్వంలో రూపొందిన రోబో సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన స్నేహితుడు , ఐ , రోబో 2.O సినిమాలతో వరుసగా అపజాయలను అందుకున్నాడు.

ఇక తాజాగా ఈ దర్శకుడు కమల్ హాసన్ హీరో గా ఇండియన్ 2 అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ విజయంతో శంకర్ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ కి కూడా విడుదల అయిన మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చింది. ఇకపోతే ఈయన వరుస అపజయాలు అందుకుంటూ ఉండడంతో కచ్చితంగా హిట్ కొట్టవలసిన దర్శకుల లిస్టులోకి చేరిపోయాడు. ప్రస్తుతం శంకర్ గేమ్ చెంజర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ మూవీ తో హిట్ కొట్టి శంకర్ ఆ లిస్టు నుండి బయటపడతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: