"వార్ 2" యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా అన్ని కోట్ల ఖర్చుతో సెట్.. ఈ దెబ్బతో ఇండియా బాక్స్ ఆఫీస్ అవుట్..?

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ వైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపు హిందీ సినిమా అయినటువంటి వార్ 2 కూడా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ "వార్ 2" సంబంధించిన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రవెల్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వల్ సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ బృందం ఈ ఇంటర్వెల్ సన్నివేశం చిత్రీకరణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇంటర్వెల్ సన్నివేశంలో వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని అత్యంత భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం చాలా కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఇంటర్వెల్స్ సన్నివేశం కోసమే ప్రత్యేకంగా ఓ బారి సెట్ ను మూవీ బృందం రామోజీ ఫిలిం సిటీలో వేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెట్ లో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ పై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే వార్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఉండడం , దానికి కొనసాగింపుగా రూపొందుతున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ కనుక సక్సెస్ సాధించినట్లు అయితే ఎన్టీఆర్ కి హిందీలో అద్భుతమైన క్రేజ్ దక్కే అవకాశం ఉంది. మరి ఈ మూవీ తో హిందీ లో ఎన్టీఆర్ కి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: