అతనితో బాలయ్య హీరోయిన్ సహజీవనం చేస్తుందా ?

Veldandi Saikiran
హనీ రోజ్ ఈ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ ఎక్కువగా సైడ్ క్యారెక్టర్ లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది హనీ రోజ్ . ఇక ఈ చిత్రం గతేడాది విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ శృతిహాసన్ ను కన్న ఎక్కువగా తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అంతేకాకుండా ఈ సినిమాలో నటించినందుకు హనీరోజ్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ బ్యూటీ వీరసింహారెడ్డి సినిమాలో కన్నా ముందుగా శివాజీ నటించిన ఆలయం సినిమాలో.... అంతేకాకుండా మరికొన్ని సినిమాలలో నటించింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక వీర సింహారెడ్డితో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ సినిమా అనంతరం వరుసగా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అంతేకాకుండా పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వంటి కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంది.

పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది. ఇక ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే హనీ రోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇక ఈ అమ్మడు అందాల ఆరబోతకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వరుస ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో హనీ రోజ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

ఈ బ్యూటీ ఓ తమిళ నిర్మాతతో రిలేషన్ కొనసాగిస్తుందని.... అంతేకాకుండా సీక్రెట్ గా ఆ నిర్మాతతో సహజీవనం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన హనీ రోజ్ అవన్నీ అబద్దాలని కొట్టి పారేసింది. అవి కేవలం పుకార్లు మాత్రమే అని తేల్చి చెప్పింది. నేను ఎవరితో రిలేషన్ కొనసాగించడం లేదు. ఎవరితో అయినా రిలేషన్ కొనసాగిస్తే తప్పకుండా అందరికీ చెబుతానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం హనీ రోజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: