పెళ్ళైన 16 రోజులకే నరకం అనుభవిస్తున్న టాలీవుడ్‌ బ్యూటీ ?

Veldandi Saikiran
తెలుగు ప్రేక్షకులకు బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఎస్తేర్ నోరాన్హ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె పేరు చెబితే ప్రతి ఒక్కరు తప్పకుండా గుర్తుపడతారు. గతంలో ఈ బ్యూటీ ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. 1000 అబద్ధాలు అనే సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. కాస్త బొద్దుగా ఉండే ఈ భామ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ పాపులారిటీ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంటుంది. ఎక్కువగా ఎస్తేర్ బోల్డ్ సన్నివేశాలలో నటిస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీకి సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు తక్కువగానే వచ్చినప్పటికీ కీలకమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తూ ఉండేది. ఇక సినిమాలో నటిస్తున్న సమయంలోనే సింగర్ నోయల్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.
కానీ ఏ మైందో తెలియదు అతి తక్కువ సమయంలోనే వీరు విడిపోయారు. కేవలం నెలరోజుల పాటే దాంపత్య జీవితం కొనసాగింది. ప్రస్తుతం ఎస్తేర్ సింగిల్ గానే తన లైఫ్ ను కొనసాగిస్తోంది. ఇక విడాకుల అనంతరం ఎస్తేర్ హద్దులు దాటి మరి తన అందాలను ఆరబోస్తూ రొమాంటిక్ సన్నివేశాలలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఇదిలా ఉండగా.... తాజాగా ఓ ఇంటర్లో పాల్గొన్న ఎస్తేర్ తన మాజీ భర్త నోయల్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

పెళ్లయిన కేవలం 16 రోజులకే నోయల్ నిజస్వరూపం బయటపడింది. అతను అస్సలు మంచివాడు కాదు. నన్ను చాలా టార్చర్ చేసేవాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పుడు కూడా సింపథి కోసం నా గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఎస్తేర్. ప్రస్తుతం ఎస్తేర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: