లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా భారతీయుడు 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
ఇండియా లోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న
శంకర్ దర్శకత్వం వహించాడు.
సిద్ధార్థ్ ,
రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియ భవాని
శంకర్ ఈ
మూవీ లో కీలక పాత్రలల్ నటించగా ...
సముద్ర ఖని , బాబి
సింహ ,
ఎస్ జె సూర్య ఈ
మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ
మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకున్న భారతీయుడు
మూవీ కి కొనసాగింపుగా రూపొందింది.
ఈ
మూవీ అద్భుతమైన విజయం అద్భుతమైన విజయం సాధించిన భారతీయుడు
మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో తెలుగు ప్రేక్షకులు భారతీయుడు 2 సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మంచి అంచనాల నడుమ రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు అతి దారుణమైన కలెక్షన్ లు తెలుగు రాష్ట్రాల్లో వస్తాయి అని చాలా మంది అనుకున్నారు.
కాకపోతే ఈ
సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే మొదటి రోజు విషయంలో ఈ
మూవీ దళపతి విజయ్ హీరో గా రూపొందిన రెండు సినిమాలను క్రాస్ కూడా చేసింది. కొంత కాలం క్రితం
దళపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్
మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.81 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టగా , విజయ్ హీరోగా రూపొందిన
మాస్టర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 6.01 కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక భారతీయుడు
మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 6.75 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది.