మండిపోతున్న ఫ్యాన్స్.. అర్పే ప్రయత్నం చేస్తున్న అడవి శేషు..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో అడవి శేషు ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలలో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈయన శైలిష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత ఈయన గూడచారి 2 అనే మూవీ ని మొదలు పెట్టాడు.

ఇకపోతే ఇప్పటికే గూడచారి మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో గూఢచారి 2 అనౌన్స్ కాగానే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇకపోతే ఈ సినిమా  అనౌన్స్ అయ్యి చాలా కాలం అవుతున్న ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్ లు ఏవి పెద్దగా విడుదల కావడం లేదు. దానితో అడవి శేషు అభిమానులు కూడా ఈ సినిమా ఉందా ... లేదా ... ఉంటే ఒక అప్డేట్ అయిన ఇస్తారు కదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా గూడచారి 2 అప్డేట్ ఇవ్వండి అడవి శేషు అన్న.

అసలేం జరుగుతుంది. మూవీ ఉందా ... రద్దయిందా కనీసం ఏదో అన్న ఒకటి చెప్పండి అంటూ ఓ పోస్ట్ చేశాడు. దీనికి అడవి శేషు స్పందించాడు. గూడచారి 2 సినిమాకు సంబంధించిన అప్డేట్ ఆగస్టు 3 వ తేదీన విడుదల చేస్తాం అని ప్రకటించాడు. ఇకపోతే అడవి శేషు కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఇక క్షణం మూవీ తో హీరో గా మంచి విజయాన్ని అందుకున్న ఈయన అప్పటి నుండి వరుసగా విజాయలను అందుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తూ వెళుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

as

సంబంధిత వార్తలు: